ఎన్టీఆర్, నాగ చైతన్య, ప్రభాస్ ముగ్గురికీ షాక్ తప్పలేదు..పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు, కానీ

First Published | Nov 7, 2024, 11:37 AM IST

టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ తో వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. దాదాపుగా అందరూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగ చైతన్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా అగ్ర హీరోలు చాలా మంది ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే.


టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ తో వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. దాదాపుగా అందరూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగ చైతన్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా అగ్ర హీరోలు చాలా మంది ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే. కొందరు హీరోల లాంచ్ అదిరిపోయింది. కొందరి ఎంట్రీ మాత్రం చప్పగా సాగింది. 

రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు తొలి చిత్రంతోనే హిట్ కొట్టి కెరీర్ ప్రారంభించారు. పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్ విషయంలో కామన్ గా ఒకటి జరిగింది. ఇద్దరూ డిజాస్టర్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించారు. నాగ చైతన్య పరిస్థితి కూడా అంతే. 


ఎన్టీఆర్ ఎలాంటి అంచనాలు లేకుండా నిన్ను చూడాలని అనే చిత్రంలో నటించాడు. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ప్రభాస్ విషయానికి వస్తే.. కృష్ణం రాజు అంతా పక్కాగా ప్లాన్ చేసి ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ ని లాంచ్ చేశారు. కానీ ఆ మూవీ కూడా ఆకట్టుకోలేకపోయింది. 

నాగ చైతన్య ఎంట్రీ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది. నాగార్జున తన వారసుడిని పెద్ద హంగామాతో లాంచ్ చేశారు. చైతు తొలి చిత్రం జోష్ ఈవెంట్ కి ఏఎన్నార్ ఫ్యామిలీతో పాటు.. వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ, రాఘవేంద్ర రావు లాంటి హేమా హేమీలు అతిథులుగా హాజరయ్యారు. 

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన జోష్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ విధంగా ఎన్టీఆర్, ప్రభాస్, నాగ చైతన్య లకి తొలి చిత్రంతోనే ఎదురుదెబ్బ తప్పలేదు. అఖిల్ కూడా అంతే.. అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్. బిగ్ డిజాస్టర్. ఇంతవరకు అఖిల్ విజయాల ఖాతా తెరవలేదు. ఎన్టీఆర్ తన రెండవ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1తో హిట్ కొట్టారు. ప్రభాస్ కి మూడవ చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ దక్కింది. ఇక చైతన్య తన సెకండ్ మూవీ ఏ మాయ చేశావేతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. 

Latest Videos

click me!