శ్రీలీలకి హ్యాట్రిక్ పడింది.. త్రివిక్రమ్ ఇలా చేస్తాడనుకోలేదు.. ఇక చివరి ఆశ అదే?

First Published | Jan 12, 2024, 4:11 PM IST

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల టాలీవుడ్ లోకి ఒక సునామీలా దూసుకొచ్చింది. ఆమె అందం, డాన్సులు ఆమెని తిప్పికొడితే ఏడాది స్టార్‌ ని చేశాయి. రెండో సినిమాతోనూ టాలీవుడ్‌ టాప్‌ గేమ్‌లోకి వచ్చింది. 

శ్రీలీల.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాపులర్‌ అయ్యింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో సినిమాతోనే టాప్‌ లీగ్‌లోకి వచ్చింది. తిప్పి కొడితే దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది. హీరోయిన్లందరికి పోటీగా మారింది. 

శ్రీలీల ఏడాదిలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఏకంగా పది సినిమా ఆఫర్లని అందుకుని నెంబర్‌ వన్‌ హీరోయిన్గా మారింది. టాప్‌లో ఉన్న సమంత, రష్మిక, పూజా వంటి హీరోయిన్లందరినీ పక్కకు నెట్టి దూసుకొచ్చింది. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. స్టార్‌ హీరోలు సైతం శ్రీలీల కోసం వెయిట్‌ చేసేలా చేసింది. 


అదే తిప్పి కొడితే ఏడాదిలోనే సీన్‌ రివర్స్ అయ్యింది. ఆమెకి వరుసగా పరాజయాలు ప్రారంభమయ్యాయి. ఒకదాని తర్వాత ఒక్కటి బోల్తా కొడుతుంది. ఇప్పుడు హ్యాట్రిక్‌ పడింది. నిజానికి ఈ ఏడాది శ్రీలీలకి కలిసి రాలేదు. వచ్చిన అన్నీ సినిమాలు పరాజయం చెందాయి. `స్కంధ` చిత్రంతో ఈ ఫెయిల్యూర్‌ ప్రారంభమైంది. మధ్యలో `భగవంత్‌ కేసరి` కాస్త రిలీఫ్‌నిచ్చింది. ఈ మూవీ హిట్‌ అయిన బాలయ్య ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత సినిమాలన్నీ పరాజయం చెందాయి. `ఎక్స్ ఆర్డినరీ మ్యాన్‌`, `ఆదికేశవ` చిత్రాల గత నెలలో బోల్తా కొట్టాయి. 

ఇప్పుడు సంక్రాంతికి `గుంటూరు కారం`తో వచ్చింది. మహేష్‌ బాబు హీరోగా నటించిన చిత్రమిది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నా, చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వస్తుంది. కథ లేకపోవడం, నాసిరకమైన సీన్లు ఉండటం ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తుంది. పూజా హెగ్డేని తప్పించి మరీ శ్రీలీలని తీసుకున్నారు. మాటల మాంత్రికుడైనా ఆమెకి సక్సెస్‌ ఇస్తారని భావించారు. కానీ ఆయన కూడా చేతులెత్తేశాడు. 

అయితే సంక్రాంతి కావడంతో వరుస సెలవులుంటాయి. సంక్రాంతి అంటే సినిమాల పండగా. మామూలుగా ఉన్నా ఆడియెన్స్ చూస్తారు. ఈ లెక్కన ఇప్పుడు అంతో ఇంతో ఈ మూవీ ఆడే అవకాశం ఉంది. కానీ హిట్‌ ఖాతాలోకి రాదు. ఇది శ్రీలీలకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓ రకంగా ఆమెకిది హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

శ్రీలీల చేతిలో ఉన్న పెద్ద సినిమాలన్నీ అయిపోయాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్ సింగ్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో గౌతమ్‌ తిన్ననూరి మూవీ చేస్తుంది. ఇందులో ఆమె ఉందా లేదా అనేది క్లారిటీ లేదు. లేదనే టాక్‌ ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో ఇక శ్రీలీల ఆశలన్నీ పవన్‌ పైనే పెట్టుకుంది. అయితే ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. 

మొత్తంగా ప్రస్తుతం శ్రీలీల గడ్డు పరిస్థితిలోనే ఉంది. అయితే నిజానికి శ్రీలీలలో టాలెంట్‌ లేదు. అందం ఉంది. చిన్న పిల్లలాగే అనిపిస్తుంది. డాన్సు ఒక్కటే ఇరగదీస్తుంది. ఆ డాన్సుల కోసమే ఆమెని హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే టాలీవుడ్‌లో పెద్ద సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అదే ఆమెని ఎంకరేజ్‌ చేసేలా చేసింది. దాని కారణంగా గట్టిగానే దెబ్బ పడింది.

ఇకపై సామాజిక నేపథ్యంలో ఎంత వరకు పనిచేస్తుంది, ఎంత వరకు ఎంకరేజ్‌ చేస్తారనేది ప్రశ్న. ఇకపై శ్రీలీలకి పరీక్షా కాలమే. ఆమె సెలక్టీవ్‌గా వెళ్లకపోతే కెరీరే ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం లేకపోలేదు. మరి ఆమె రూట్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!