విజయ్ దేవరకొండకు హ్యాండిచ్చిన శ్రీలీలా.! హిట్ ఇచ్చిన మాస్ రాజాకు కూడానా?

First Published | Sep 26, 2023, 3:04 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలాకు వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో సందడి షురూ చేయబోతోంది.
 

యంగ్ సెన్సేషన్ శ్రీలీలా భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కుర్ర హీరోయిన్ కు టాలెంట్ కు ఆఫర్లు దండిగా వస్తున్నాయి. ఏకంగా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ టాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. తన సినిమాలు ప్రస్తుతం వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి.
 

ఇక శ్రీలీలా చేతిలో ప్రస్తుతం పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, బాలయ్య ‘భగవంత్ కేసరి’, విజయ్ దేవరకొండ VD12తో పాటు మరిన్ని సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. 
 


అయితే, ఈ చిత్రాలన్నీ ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని చివరిదశలోనూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీలీలాకు ఓ చిక్కు వచ్చి పడింది. తను ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ కు డేట్స్ సర్దడంలో సమస్య ఎదుర్కొంటోంది. అప్పటికే బిజీ షెడ్యూల్ తో ఉండగా.. కొత్తగా ఓకే చెప్పిన చిత్రాలకు డేట్స్ ఇవ్వడం కష్టంగా మారిందంట.
 

దీంతో శ్రీలీలా షాకింగ్ డెసిషన్ తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. చివరిగా శ్రీలీలా హీరోయిన్ గా విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరు కాంబోలో VD12 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. శ్రీలీలా కూడా ఈవెంట్ లో సందడి చేసింది. కానీ, ఈ ముద్దుగుమ్మ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. ఆ ప్లేస్ రష్మిక మందన్న వచ్చి చేరిందని కూడా టాక్.
 

ఇక డేట్స్ సెట్ కాకపోవడంతోనే విజయ్ దేవరకొండకు హ్యాండించిందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. కానీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండటం గమనార్హం. అలాగే ‘ధమాకా’తో మాస్ మహరాజా శ్రీలీలాకు మంచి బ్రేక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో శ్రీలీలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
 

మరోసారి రవితేజ - శ్రీలీలా కాంబోలో ఓ సినిమా సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా బిజీ షెడ్యూల్ కారణంగా మాస్ రాజా  సినిమాకూ దూరంగా ఉందని తెలుస్తోంది. ఇలా రెండు ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా శ్రీలీలా సినిమాలనే వదులుకేనే స్థాయికి వెళ్లిందంటే ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 28న రామ్ పోతినేని ‘స్కంద’తో అలరించనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  

Latest Videos

click me!