నాతో పోటీ పడకండి, నేను స్కిప్పింగ్ బాగా ఆడతాను. కావాలంటే పోటీ పెట్టుకుందాం అంటుంది కావ్య. నీతో నాకు పోటీ ఏంటి అంటాడు రాజ్. కానీ రాజ్ ని రెచ్చగొట్టి పోటీలో పాల్గొనే లాగా చేస్తారు సీతారామయ్య దంపతులు. రాజ్ ని సీతారామయ్య, కావ్య ని చిట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆటలో కావ్య గెలుస్తుంది. ఏంటి రాజ్ భార్య చేతిలో ఓడిపోయావు అంటాడు సీతారామయ్య. ఆయన ఓడిపోలేదు తాతయ్య, నేను గెలిచాను అంతే అని భర్తని వెనకేసుకొస్తుంది కావ్య.