మరింత నాజుగ్గా యాపిల్ బ్యూటీ.. టైట్ ఫిట్ లో మెరిసి, కిర్రాక్ ఫోజుల్చిన హన్సికా

First Published | Sep 26, 2023, 2:08 PM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ కిర్రాక్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టైట్ డ్రెస్ లో అదరగొట్టింది.

‘దేశముదురు‘తో నటిగా కెరీర్ ప్రారంభించిన హన్సికా మోత్వానీ తొలిచిత్రంతోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నటనపరంగా, డాన్స్ పరంగా, గ్లామర్ పరంగా ఆడియెన్స్ ను మెప్పించింది. 
 

ఆ తర్వాత తెలుగులో పాటు తమిళంలోనూ వరుస ప్రాజెక్ట్స్ చేసింది. బడా హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.


గతేడాది డిసెంబర్ హన్సికా పెళ్లి పీటలు ఎక్కింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది.

ఈ క్రమంలో కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ నూ ప్రారంభించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో నటిగా ఫుల్ బిజీ అయ్యింది. రీసెంట్ గా ‘పార్టనర్’ అనే చిత్రంలో మెరిసింది. తెలుగు, తమిళంలో ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తోంది.
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ హన్సికా చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా విషయాలనూ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. బాడీకి అతుక్కుపోయే అవుట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. మరింత నాజుగ్గా మెరిసి కుర్రాళ్లను ఫిదా చేసింది. ఈ సందర్భంగా కిర్రాక్ స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

Latest Videos

click me!