బాలయ్యది గొప్ప మనస్సు.. నా లైఫ్ లో లేనివన్నీ ఇచ్చారు.. శ్రీలీలా ఎమోషనల్ కామెంట్స్..

First Published | Oct 8, 2023, 8:55 PM IST

‘భగవంత్ కేసరి’  చిత్రం ట్రైలర్ ఈవెంట్ వరంగల్ గడ్డపై చాలా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా వేదికపై శ్రీలీలా మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడింది. 
 

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)   చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో ‘భగవంత్ కేసరి’ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఈరోజు Bhagavanth Kesari  ట్రైలర్ ఈవెంట్ ను వరంగల్ గడ్డపై నిర్వహించారు.  
 

డివైన్ వైబ్స్ తో ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతోంది. ఈవెంట్ లకు యంగ్ డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మాలినేని, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. అలాగే స్టార్ హీరోయిన్ కాలజ్ అగర్వాల్ కూడా హాజరైంది. ఇక శ్రీలీలా ట్రెడిషనల్ లుక్ లో హాజరై ఎమోషనల్ స్పీచ్ తో ఆకట్టుకుంది. 
 


శ్రీలీలా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను. బ్యూటీఫుల్ స్టోరీలో విజ్జిపాపాగా నటించాను. అలాగే ఇక్కడి వచ్చాను. ఇంతంటి సోల్ కనెక్ట్ క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి నాకిచ్చారు. చాలా థ్యాంక్యూ. నేను చాలా స్టోరీస్ పై సినిమాలు చేస్తున్నాను. కానీ ఈ పాత్ర నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. రోజులు గడుస్తున్నా కొద్దీ నేను ఆ పాత్రలా మారిపోయాను. చాలా బ్యూటీఫుల్ గా తీశారు.
 

ఇక బాలకృష్ణగారితో నాకు ఎమోషనల్ టైమ్ ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతం. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు చేసేప్పుడు.. కట్ చెప్పినా.. అదే మూడ్ లో కంటిన్యూ అయ్యాను. వెంటనే బయటకి రాలేకపోయాను. అలాంటి సందర్భాల్లో నన్ను నవ్వించి నార్మల్ స్టేజీకి తీసుకొచ్చేవారు. నాకు బాగా సపోర్ట్ చేశారు. 
 

ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్  గుర్తుండిపోతాయి. ఇక బాలయ్య గారు నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా అందించారు. ఇది మీ గొప్ప మనస్సు అంటూ భావోద్వేగమైంది. తన స్వీట్ స్పీచ్ తో బాలయ్యను ఆకాశానికి ఎత్తింది. సెట్స్ లో నందమూరి నటసింహంతో కలిసి చేసిన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను సంతోషంగా వ్యక్తం చేసింది. 
 

అలాగే టెక్నిషీయన్లు కూడా అద్భుతంగా వర్క్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!