సన్నీ లియోన్ ‘తెలుగు మీడియం ఇస్కూల్’ ప్రోమో.. ఎనిమిది మంది విదేశీయులతో సరికొత్తగా..

First Published | Oct 8, 2023, 6:00 PM IST

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా ప్రముఖ నటి సన్నీలియోన్ జడ్జీగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘తెలుగు మీడియం ఇస్కూల్’. ఊహించని విధంగా షోను డిజైన్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.
 

సన్నీలియోన్ (Sunny Leone) గురించి, ఆమె ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడల్ట్ చిత్రాలతో పాపులర్ అయిన ఆమె బాలీవుడ్ సినిమాలతో నటిగా మారింది. ‘జిస్మ్2’, ‘రాగిణి ఎంఎంఎస్ 2’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక రీసెంట్ గా సన్నీ లియోన్ జడ్జీగా తెలుగులో ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో ప్రారంభమైంది.
 

సన్నీలియోన్, యాంకర్ రవి, డ్యాన్సర్ పండుతో Telugu Medium Ischool  రియాలిటీ షోను గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జీతెలుగులో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. సరికొత్తను షోను డిజైన్ చేశారని అనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో రానివిధంగా ఈ షోను రన్ చేయబోతున్నారు.
 


ప్రోమో చాలా గ్రాండ్ గా ఉంది. యాంకర్ రవి, పండు, అరియానా గ్లోరీ, అప్పల్ రాజు, నటుడు మహేశ్, బిగ్ బాస్ ఫైమా తదితరులు షోలో మెరిశారు. ఫన్ జనరేట్ చేసే అంశాలతో  ప్రారంభమైన షోకు జడ్జీగా సన్నీలియోన్ ను ఆహ్వానించారు. చీరకట్టులో తెలుగు సంప్రదాయ బద్ధంగా సన్నీలియోన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. షోను ప్రారంభించింది. 
 

అయితే ఈషోలోకి పలు దేశాలకు చెందిన లోకల్ టాలెంట్స్ ను ఆహ్వానించారు. ఐదు దేశాలు ఆఫ్రికన్ ఐలాండ్, రష్యా,  స్కాట్ లాండ్, జపాన్, యూఎస్ఏకు చెందిన ఎనిమిది మందిని పిలిపించారు. విదేశీయులతో తెలుగు బుల్లితెర సెలబ్రెటీలను జంటగా చేసి సరికొత్తగా షోను డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రోమో ద్వారా వెల్లడించారు. 
 

ప్రోమోతో షోపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక సన్నీలియోన్ కూడా సందర్భానుసారంగా తనదైన శైలిలో స్పందిస్తూ, పంచులు పేల్చుతూ అలరిస్తోంది. ఈ షోతో మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 8న (ఈరోజు) రాత్రి 9 గంటలకు జీ తెలుగు, జీ సినిమాలులో ప్రసారం కానుంది. అలాగే నెక్ట్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15న మరో ఎపిసోడ్ రానుంది. షో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇక సన్నీలియోన్ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కామియో అపియరెన్స్ తో అదరగొట్టింది. ‘పీవీఎస్ గరుడ వేగ’, ‘జిన్నా’ వంటి తెలుగు చిత్రాలతో అలరించింది. తొలిసారిగా తెలుగు టెలివిజన్ రంగంలో ‘తెలుగు మీడియం ఇస్కూల్’తో అడుగుపెట్టింది. 
 

Latest Videos

click me!