స్టార్ హీరోతో డేటింగ్.. పెళ్లికి శ్రీలీల ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?

Published : Sep 09, 2025, 10:53 AM IST

Sreeleela Dating Rumors with Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల బంధం కేవలం తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందనేలా మరో ఘటన జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటీ? 

PREV
16
స్టార్ హీరోతో డేటింగ్?

Sreeleela: అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఆ త‌ర్వాత వరుసగా స్టార్ హీరోల‌తో ప‌లు సినిమాల్లో నటించి, మెప్పించింది. ఈ మధ్యకాలం అంత పెద్ద హిట్ లేకపోయినా.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్నది శ్రీలీల.

వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. స్టార్ హీరోలందరూ శ్రీలీల జపం చేస్తుండటంతో ఆమె డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. హీరోయిన్ అన్నాక రూమర్స్ సహజం, అదే ఇప్పుడు శ్రీలీల చుట్టూ ఓ రూమర్ బాగా చక్కర్లు కొడుతోంది.

26
బాలీవుడ్ ఎంట్రీ – ఆషికీ 3

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దుమ్మురేపిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన "ఆషికీ 3"లో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. షూటింగ్ సమయంలోనే కార్తీక్–శ్రీలీలల మధ్య ఏర్పడిన పరిచయం మరింత క్లోజ్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

36
రెస్టారెంట్ డేట్స్ – మీడియాకు దొరికిన జంట

ఇటీవల ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ డిన్నర్‌కి వెళ్ళిన వీడియోలు బయటకొచ్చాయి. పబ్లిక్‌లో కలిసి కనిపించడం వల్ల వీరి రిలేషన్‌షిప్ నిజమేనని పుకార్లకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, గతంలో కార్తీక్ తల్లి మాల తివారీ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఓ మూవీ సమ్మిట్‌లో కార్తీక్ ఆర్యన్ తల్లితో శ్రీలీల చాలా క్లోజ్‌గా మూవ్ అవ్వడం కూడా ఈ రూమార్స్ ను మరింత స్ట్రాంగ్ చేసింది. పైగా "నా కొడుక్కి కోడలిగా ఓ మంచి డాక్టర్ రావాలి" అని కోరుకుంటున్ననని తెలిపింది. వృత్తిరీత్యా శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కావడంతో, కార్తీక్ తల్లి కోరుకున్న కోడలు ఈమెనే అంటూ బీటౌన్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది.

46
వినాయక చవితి వేడుకల్లో శ్రీలీల తల్లి!

కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల బంధం కేవలం తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందానేలా మరో ఘటన జరిగింది. తాజాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీలీల మాత్రమే కాకుండా ఆమె తల్లి కూడా పాల్గొనడం మరింత సంచలనంగా మారింది. ఇరు కుటుంబాలు కలిసి పండుగ జరుపుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అలాగే.. కార్తీక్ కుటుంబంతో శ్రీలీల కుటుంబం కలిసి గ్రూప్ ఫోటో దిగడం చూసి, ఇప్పటికే పెళ్లికి శ్రీలీల తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటూ హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని సోషల్ మీడియాలో టాక్ షూరు అయ్యింది. ఇరు కుటుంబాలు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

56
పెళ్లి బజ్‌పై క్లారిటీ ఎప్పుడొస్తుంది?

ఇలా ఇరు కుటుంబాలు పండుగ వేళ కలుసుకోవడంతో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య రిలేషన్‌షిప్ నిజమా? పెళ్లి జరగబోతుందా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ డేటింగ్ రూమర్లపై కార్తీక్ గానీ, శ్రీలీల గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే వీరిద్దరి క్లోజ్ మూవ్‌మెంట్స్, కుటుంబాల అంగీకారం బజ్‌కి మరింత బలం ఇస్తున్నాయి. అలాగే.. వారి మధ్య ఏదో బలమైన బంధం ఉందనే సంకేతాలను స్పష్టంగా పంపుతోంది.

66
ఫుల్ బిజీ డైరీ

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ సరసన మాస్ జాతర, పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో పరాశక్తి సినిమాల్లో నటిస్తోంది. ఇవేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లో రష్మిక మందన్న స్థాయిలో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీలీల, ఎక్కువగా ముంబైలోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె తల్లి కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.

Read more Photos on
click me!

Recommended Stories