నేనేంటో అందరికీ తెలుసు, నీ స్పెషాలిటీ ఏంటి బ్రదర్..ఎన్టీఆర్ రెచ్చగొట్టడం వల్లే అతడు స్టార్ హీరో అయ్యాడా

First Published | Aug 4, 2024, 8:58 AM IST

స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు స్ఫూర్తి దాయకం. చిరంజీవి లాంటి అగ్ర నటులకు సైతం ఎన్టీఆర్ అద్భుతమైన సలహాలు ఇచ్చేవారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు స్ఫూర్తి దాయకం. చిరంజీవి లాంటి అగ్ర నటులకు సైతం ఎన్టీఆర్ అద్భుతమైన సలహాలు ఇచ్చేవారు. కేవలం సినిమా రంగానికి సంబంధించిన సలహాలు మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్టీఆర్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి అని చిరంజీవి ఓ సందర్భంలో పేర్కొన్నారు. 

అదే విధంగా హాస్యంలో తనదైన ముద్ర వేసిన రాజేంద్ర ప్రసాద్ కి కూడా ఎన్టీఆర్ అద్భుతమైన సలహాలు ఇచ్చారట. ఎన్టీఆర్ సోదరుడు నిర్మాత త్రివిక్రమ రావు సహకారంతో రాజేంద్ర ప్రసాద్ ఫిలిం స్కూల్ లో నటనలో శిక్షణ కోసం జాయిన్ అయ్యారట. 


ఇదంతా రాజేంద్ర ప్రసాద్ నటుడు కాకముందు. రాజేంద్ర ప్రసాద్ ఫుల్ లెన్త్ హీరో కాకముందు కొన్ని సీరియస్ రోల్స్ చేశారు. పర్వాలేదనిపించే విధంగా గుర్తింపు వస్తోంది. ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యే తప్పుడు ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ ని అంతగా పట్టించుకోలేదట. సినిమా రంగం పట్ల అంతగా ఆసక్తి ఉన్న కుర్రాడిలా కనిపించడం లేదు అని చెప్పారట. 

కానీ ఫిలిం స్కూల్ లో రాజేంద్ర ప్రసాద్ గోల్డ్ మెడల్ సాధించగానే ఎన్టీఆర్ అప్పుడు అతడిని నమ్మారట. ఎన్టీఆర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నారు. ఎన్టీఆర్.. రాజేంద్ర ప్రసాద్ ని పిలిచి.. ప్రసాద్ ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నా. ఇండస్ట్రీలో మీకంటూ ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేసుకొవాలి బ్రదర్. లేకుంటే కష్టం. 

నా నా గురించి ఎవరిని అడిగినా పౌరాణిక చిత్రాల గురించి చెబుతారు. అది నా స్పెషాలిటీ. బ్రదర్ నాగేశ్వర రావు గురించి అడిగితే సాంఘిక చిత్రాల గురించి చెబుతారు. ఆ విధంగా నీకు ఏదైనా స్పెషాలిటీ ఉందా ? నీకంటూ ప్రత్యేక శైలి లేకుంటే ఇండస్ట్రీలో నిలబడడం కష్టం అని ఎన్టీఆర్ రాజేంద్ర ప్రసాద్ ని రెచ్చగొట్టారట. 

ఎన్టీఆర్ చెప్పిన మాటల వల్లే ఇండస్ట్రీలో నేను ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టా. అప్పడే చార్లీ చాప్లిన్ చిత్రాలు చూశా. తెలుగులో అప్పటి వరకు కామెడీ సినిమాలో సపరేట్ గా ఉంటూ వచ్చింది. కామెడీ కోసం అంటూ ఏ హీరో లేడు. హీరోనే కంప్లీట్ గా కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో లేడీస్ ట్రైలర్ లాంటి చిత్రాలు మొదలు పెట్టా. అవి బాగా సక్సెస్ కావడంతో కామెడీ హీరోగా టాలీవుడ్ లో నా స్థానం పదిలం అయింది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

Latest Videos

click me!