కృష్ణంరాజు మరణం తర్వాత కుంగిపోయిన పెద్దమ్మకి ప్రభాస్‌ ఏం చెప్పాడో తెలుసా? ఆ ఒక్క మాటతో శ్యామలాదేవి లైఫ్‌ ఛేంజ్

First Published | Aug 4, 2024, 8:30 AM IST

కృష్ణంరాజు చనిపోవడంతో ఒంటరై కుంగిపోతున్న పెద్దమ్మకి ప్రభాస్‌ చెప్పిన ఒక్క మాట ఆమె లైఫ్‌నే మార్చేసిందట. ఈ విషయం చెబుతూ ఎమోషనల్‌ అయ్యంది శ్యామలాదేవి. 
 

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు.. రాజుల ఫ్యామిలీ అయినా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ప్రారంభంలో అందరిలాగే స్ట్రగుల్స్ ఫేస్‌ చేశాడు. చిన్న చిన్న పాత్రల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. సొంత బ్యానర్‌ పెట్టుకుని హీరోగా సినిమాలు చేసి నిలబడ్డాడు. స్టార్ గా ఎదిగాడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుల తరహాలో ఆ స్థాయి ఇమేజ్‌, స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. యాంగ్రీయంగ్ మేన్‌ నుంచి రెబల్‌ స్టార్‌గా ఎదిగారు కృష్ణంరాజు. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించారు. 
 

ఇప్పుడు ఆయన లెగసీని, వారసత్వాన్ని ప్రభాస్‌ కొనసాగిస్తున్నాడు. రెబల్‌ స్టార్ కి మించిన స్టార్‌డమ్‌, పాపులారిటీతో రాణిస్తున్నారు. ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌ గా ఎదిగాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ప్రభాస్‌ది. రాజుల ఫ్యామిలీ కావడంతో అదే హుందాతనం, అదే సేవాగుణంతో అందరి ప్రేమని పొందుతున్నాడు. అయితే తనకు పెద్ద దిక్కుగా ఉన్న, తన ఫ్యామిలీకి బ్యాక్‌ బోన్‌లా ఉన్నా పెదనాన్న కృష్ణంరాజు మరణం ఆయన్ని కలచివేసింది. తీరని విషాదాన్ని మిగిల్చింది. 
 


రెబల్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో భార్య శ్యామలా దేవి చాలా బాధపడింది. ఒక్కసారిగా జీరో అయిపోయిన పరిస్థితి. ముగ్గురు ఆడపిల్లలు.. వాళ్ల పరిస్థితి ఏంటి? ఏం చేయాలనే బాధలో ఉంది శ్యామలా దేవి. అదే సమయంలో పిల్లలు కూడా ఒంటరైన ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రభాస్‌ చెప్పిన మాట మైండ్‌ బ్లోయింగ్‌. 
 

పెదనాన్న పోయిన బాధలో కుంగిపోతున్న పెద్దమ్మ శ్యామలాదేవిని చూసిన ప్రభాస్‌.. వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయన పెద్దమ్మ వద్దకు వెళ్లి ధైర్యాన్నిచ్చాడట. ఆ బాధలో ఉన్న టైమ్‌లో బాబు వచ్చిన, మీరు అసలు బాధ పడకూడదు. అసలు పెదనాన్న లేరని ఎందుకు అనుకుంటున్నారు. మనం బాధపడితే ఆయన లేరని అర్థం. అదే మనం ధైర్యంగా ఉండి, ఆయన గురించి మాట్లాడుకుంటూ, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తే ఆయన మనతోనే ఉన్నట్టు అని చెప్పి ధైర్యాన్నిచ్చాడట ప్రభాస్‌. 
 

ప్రభాస్‌ చెప్పిన మాటతో శ్యామలాదేవి రియలైజ్‌ అయ్యిందట. బాబు కరెక్టే చెప్పాడు కదా అనిపించిందట. దీంతో ధైర్యం తెచ్చుకుని ఇక ఇలా ఉండకూడదని భావించి రెగ్యూలర్‌గా బయటకు వెళ్లడం ప్రారంభించిందట. బయటకు వెళ్లినప్పుడు చాలా మంది జనాలు, ప్రముఖులు కలిసి మాట్లాడుతుంటే, కృష్ణంరాజుకి నేను పెద్ద అభిమానిని, ఆయన మాకు ఎంతో చేశారని, ఆయన గొప్ప నటుడు అని మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇది కదా అసలు లైఫ్‌ అనిపించిందట, ఇది కదా మనకు కావాల్సింది అనుకుందట. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఆ మాటలు ప్రతి రోజు వినిపిస్తుంటే ఇంకా అంత కంటే ఏం కావాలి అని చెప్పింది. ఆ రోజు ప్రభాస్‌ చెప్పిన ఆ మాటతో తన లైఫ్‌ మారిపోయింది అని పేర్కొంది శ్యామలా దేవి. 

ప్రభాస్‌ ఇటీవల `కల్కి 2898 ఏడీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇది పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆయన `ది రాజాసాబ్`తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా, సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, `సలార్ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది. 
 

Latest Videos

click me!