మహేష్‌, రానా, దుల్కర్‌, కియారా, అనుష్క.. వీరి స్కూల్‌ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ సెలబ్రిటీస్‌

Published : Aug 04, 2024, 07:38 AM IST

స్నేహం ఒక ప్రత్యేకమైన అనుబంధం. స్వార్థం లేనిది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైనది. మరి సినిమా రంగంలో పాపులర్‌ స్టార్స్ చెప్పిన స్నేహం కబుర్లేంటో ఓ లుక్కేద్దాం.   

PREV
16
మహేష్‌, రానా, దుల్కర్‌, కియారా, అనుష్క.. వీరి స్కూల్‌ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ సెలబ్రిటీస్‌

ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. అది చిన్నప్పుడు కానీ, టీనేజ్‌లోగానీ, పెద్దయ్యాకగానీ కచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ చిన్నప్పుడు స్కూల్‌ ఫ్రెండ్స్ ది ఓ స్పెషల్‌ బాండింగ్‌. అది ఎప్పటికీ మర్చిపోలేని, అదొక మధుర జ్ఞాపకం. ఇలా మహేష్‌బాబు, రానా, దుల్కర్‌ సల్మాన్‌, కియారా అద్వానీ, అనుష్క శర్మలకు కూడా స్కూల్‌ డేస్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు ఇప్పుడు ఇండియన్‌ మోస్ట్ వాంటెడ్‌ సెలబ్రిటీస్‌ లిస్ట్ లో ఉండటం విశేషం. మరి వాళ్లెవరో ఓ లుక్కేద్దాం. 
 

26

సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న మహేష్‌ బాబుకి స్కూల్‌ డేస్‌లో ఓ ఫ్రెండ్‌ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు హీరో సూర్య. ఈ ఇద్దరు చెన్నైలోని సెయింట్‌ బీడ్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఒకే క్లాస్‌ మాత్రమే కాదు, మధ్యాహ్నం టిఫిన్స్ కూడా మార్చుకునేంత ఫ్రెండ్‌ కావడం విశేషం. సూర్య ఈ విషయాన్ని వెల్లడించారు. సూర్య ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. 
 

36

రానా విలక్షణ నటుడిగా రాణిస్తున్నాడు. ఆయనకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. అక్కడ నాగ్‌ అశ్విన్‌ తనకు బెస్ట్ ఫ్రెండ్‌. ఈ ఇద్దరు ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుకున్నారట. `లీడర్‌` సినిమాతో ఈ ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చారు. నాగ్‌ అశ్విన్‌ ఇటీవల `కల్కి 2898ఏడీ` సినిమాతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. 
 

46

తెలుగులో హీరోగా బిజీగా ఉన్న దుల్కర్‌ సల్మాన్‌..`సలార్‌` స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇద్దరు స్కూల్‌ ఫ్రెండ్స్ అట. ఇద్దరు కలిసి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఇద్దరి ఇళ్లు దగ్గరదగ్గరే ఉండేవి. వాళ్లు పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్. అలా ప్రతి విషయం షేర్‌ చేసుకునేవాళ్లు. కలిసి తినడం, కలిసి ఆడుకోవడం ఇలా ప్రతి పంచుకునేవాళ్లు. చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరిగారు. ఇప్పుడూ అది కొనసాగుతుంది. దుల్కర్‌ పాన్‌ ఇండియా హీరోగా రాణించే ప్రయత్నం చేస్తుండగా, `సలార్‌`, `ది గోట్‌ లైఫ్‌` చిత్రాలతో పృథ్వీరాజ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు మహేష్‌ రాజమౌళి  సినిమాలో ఆయన నటిస్తున్నాడట. 
 

56

కియారా అద్వానీ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌`లో నటిస్తుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుందని చెప్పొచ్చు. ఆమెకి ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కూతురు ఈషా అంబానీ ఫ్రెండ్ కావడం విశేషం. ఈ ఇద్దరు ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. కియారాని అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంలో ఈషా పాత్ర ఉందట. ఆమె పెళ్లిలోనూ ఈషానే రెడీ చేసిందట. ఇప్పటికీ ఆ స్నేహం పదిలంగా కొనసాగుతుందని చెప్పింది ఈషా  అంబానీ. 
 

66

అనుష్క శర్మ(కొహ్లీ భార్య).. కి కూడా స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్‌ ఉంది. ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లనే పెళ్లిచేసుకోవడం విశేషం. ఆమె ఎవరో కాదు, ధోనీ భార్య సాక్షి ధోని. ఈ ఇద్దరు చిన్ననాటిస్నేహితులు. అస్సోంలోని మార్గరీటా లో ఉన్న సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువుకున్నారట. ఇద్దరి నాన్నలు ఉద్యోగ రీత్యా మార్గరీటాలో ఉండేవాళ్లు. స్కూల్‌కి వెళ్లిన మొదటి రోజు సాక్షి ఎంతో బాగా మాట్లాడిందట. దీంతో అప్పట్నుంచి ఆమె పక్కనే కూర్చునేదాన్ని అని, అలా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అనుష్క శర్మ తెలిపింది. ఇలా సెలబ్రిటీలందరికి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు ఆల్మోస్ట్ ఒకే వృత్తిలో రాణించడం, లేదా ఒకే స్థాయిలో పాపులారిటీని సంపాదించడం ఇక్కడ ప్రత్యేకత. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories