డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జాకబ్ బటాలన్, జాన్ బెర్న్‌తల్, ట్రామెల్ టిల్‌మన్, మైఖేల్ మాండో, మార్క్ రఫెలో ప్రధాన పాత్రలు పోషించారు. టామ్ హాలండ్ మొదటిసారిగా 2016లో వచ్చిన 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్' సినిమాలో పీటర్ పార్కర్‌గా కనిపించి, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్‌తో కలిసి 'స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్'లో హీరోగా నటించాడు. 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్: ఎండ్‌గేమ్', 'స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్', 'వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్' (అతిథి పాత్ర), 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' వంటి సినిమాల్లో కూడా స్పైడర్ మ్యాన్‌గా కనిపించాడు.