Pradeep Rawat: భారతీయ సినిమా సీనియర్ నటుడు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకులకు విలన్ పాత్రలతో సుపరిచితుడైన ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా సీనియర్ స్టార్ ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన అనేక భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, ఆగస్టు 4న సాయంత్రం ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు యశ్‌పాల్ శర్మ సోషల్ మీడియాలో పంచుకోవడంతో, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
25
సై సినిమాలో విలన్ ప్రదీప్ రావత్
ప్రదీప్ రావత్ తన కెరీర్‌ను బీ.ఆర్. చోప్రా 'మహాభారతం' టీవీ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభించారు. ఆ తర్వాత 'లగాన్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సై సినిమాలో భిక్షుయాదవ్ గా ఆయన నటన చాలా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. అంతే కాదు సై' సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆతరువాత తెలుగులో వరుసగా చత్రపతి, ఆంజనేలు, యోగి, స్టాలిన్, అందరివాడు ఇలా దాదాపు 70 కి పైగా తెలుగు సినిమాల్లో నటించాడు ప్రదీప్ రావత్.
35
గజినీ సినిమాతో తమిళంలో ఫేమస్..
ఇక తెలుగుతో పాటు తమిళంలో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజినీ' సినిమా ఆయనకు తమిళంలో ప్రత్యేక స్థానం కల్పించింది. సూర్యకు విలన్‌గా ఆయన నటనకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన హిందీ రీమేక్‌లో కూడా ఆయనే విలన్‌గా నటించారు.తన ఎత్తైన ఆకారం, గంభీరమైన బాడీ లాంగ్వేజ్, పదునైన కంఠంతో భారతీయ సినిమాలో ప్రత్యేకమైన విలన్‌గా నిలిచారు.
ప్రదీప్ రావత్ ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో కలిపి 150కి పైగా చిత్రాల్లో నటించారు. తన భయంకరమైన చూపులు, గంభీరమైన గొంతు, నటనతో దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.
55
సోషల్ మీడిాయాలో అభిమానుల నివాళి..
ప్రదీప్ రావత్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మదిలో భిక్షు యాదవ్ గా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.