నాకొక చెడ్డ అలవాటుంది, ప్రకాష్ రాజ్ కి ప్రభాస్ మాస్ వార్నింగ్.. స్పిరిట్ స్టోరీ ఇదే, అదిరిపోయిన సర్ప్రైజ్

Published : Oct 24, 2025, 12:05 AM IST

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కథని తెలియజేసేలా ఒక సర్ప్రైజ్ సౌండ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్, ప్రకాష్ రాజ్ మధ్య సంభాషణ నెక్స్ట్ లెవల్ లో ఉంది. . 

PREV
15
ప్రభాస్ పుట్టినరోజు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అక్టోబర్ 23 గురువారం ఘనంగా జరిగాయి. దెస వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. 

25
స్పిరిట్ స్టోరీ రివీల్ చేసేలా స్పెషల్ వీడియో 

ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ నోట్ లో ముగిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే పడేట్టు ఇచ్చారు. స్పిరిట్ మూవీ కథని సౌండ్ రూపంలో తెలియజేస్తూ ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ప్రభాస్ పాత్ర గురించి తెలియజేసేలా, కథ గురించి హింట్ ఇచ్చేలా ఈ వీడియోలో డైలాగులు ఉన్నాయి. 

35
రిమాండ్ విధించబడ్డ ఐపీఎస్ అధికారి

పాత్రలో ప్రభాస్  వీడియోలో ఉన్న డైలాగుల ప్రకారం..జైలుకి రిమాండ్ విధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకువస్తారు. ఆ జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్ ఉంటారు. ప్రకాష్ రాజ్ మాటలని బట్టి చూస్తే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అర్థం అవుతోంది. రిమాండ్ విధించిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో కాదు.. ప్రభాసే. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, అకాడమీ టాపర్ అని ప్రకాష్ రాజ్ కి కానిస్టేబుల్ పరిచయం చేస్తారు. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా లేకున్నా బిహేవియర్ లో తేడా ఉండదని.. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఒక సారి టెర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్.. అతనికి ఇది రిమాండ్ పీరియడ్ అని కానిస్టేబుల్ చెబుతాడు. నా కాంపౌండ్ లో రెండే యూనిఫామ్ లు ఉంటాయి ఒకటి ఖాకీ లేదా ఖైదీ అని ప్రకాష్ రాజ్ అంటారు. వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్టుకి పంపండి అని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు వినొచ్చు. 

45
ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ 

ఇక చివర్లో ప్రకాష్ రాజ్ కి ప్రభాస్ ఇచ్చే వార్నింగ్ అదిరిపోయింది. మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి చెడ్డ అలవాటు ఉంది. దానినే ఇంగ్లీష్ లో మరోసారి ప్రభాస్ రిపీట్ చేస్తాడు. 

55
అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగా 

 సో సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఈ పడేట్టు తో స్పిరిట్ మూవీ థీమ్ అర్థం అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా ఉంటాడు. ఎవరినీ లెక్క చేయని బిహేవియర్. ఓ కేసులో ప్రభాస్ కి రిమాండ్ విధిస్తారు. ఇదంతా ఎందుకు జరిగింది అనే ఆసక్తిని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఒక్క వీడియోతో పెంచేశారు. ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories