గాన గంధర్వుడిగా గుర్తింపు పొందిన లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో 40 వేలపైగా పాటలు పాడారు. అన్ని భాషల్లో బాలు పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. చాలా కాలం పాటు బాలు ఇండియాలో టాప్ సింగర్ గా రాణించారు. బాలసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాం నుంచి పవన్, మహేష్ లాంటి హీరోల వరకు తన పాటలతో అలరించారు.
SP Balasubrahmanyam
ఎస్పీ బాలు తన కెరీర్ లో జరిగిన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నా కెరీర్ లో నేను అతి కొద్దిమంది నటులకు మాత్రమే గొంతు మార్చి పాడవలసి వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు గొంతు మార్చి పాడేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటలలో ఘంటసాల గారి గొంతు జనాలకు బాగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నేను పాడుతుంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ గొంతుకు మ్యాచ్ అయ్యేది కాదు. దీనితో గొంతు మార్చి పాడేందుకు శ్రమించాను. కొన్ని రోజుల తర్వాత నాకు గ్రిప్ దొరికింది అని ఎస్పీ బాలు అన్నారు.
SP Balasubrahmanyam
రాజబాబు, అల్లు రామలింగయ్య లాంటి కమెడియన్లకు వారిని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసేవాడిని. నాగార్జున విషయానికి వస్తే మన్మథుడు చిత్రంలో కొన్నిసార్లు మిమిక్రీ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే అక్కడ చెబుతున్నది నాగార్జునే అని జనాలు నమ్మాలి. వద్దురా సోదరా సాంగ్ లో శివ అని నా ఫ్రెండ్, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు అంటూ పాట మధ్యలో నాగార్జునని మిమిక్రీ చేయాల్సి వచ్చింది.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు పాడేసమయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ లో ఒక కసి ఉంటుంది. దానిని అర్థం చేసుకుని పాడా. చాలా మంది నటులు నా పాటకు న్యాయం చేశారు. అదే విధంగా చాలా మంది హీరోలు నా పాటకి అన్యాయం చేశారు. అయితే వాళ్ళ పేర్లు నేను చెప్పను అని బాలు అన్నారు. నాకు పర్సనల్ కొన్ని అలవాట్లు ఉన్నాయి. నాకు డ్రింక్ చేసే అలవాటు ఉంది. బాపు, మహదేవన్ లాంటి వారితో కూర్చుని డ్రింక్ చేశా. ఆ అవకాశం ఎంతమందికి దొరుకుతుంది ? ఆ టైంలో నన్ను కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డ్రింక్ బాటిల్స్ సప్లై చేసి బాలు అవకాశాలు అందుకుంటున్నారు అని చీప్ గా కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
sp balasubrahmanyam
వెంటనే నేను కౌంటర్ కూడా ఇచ్చాను. నేను బెస్ట్ అని నమ్మారు కాబట్టి వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం నాకు ఇచ్చారు. డ్రింక్ ఆఫర్ చేశారు. అదే విధంగా సాంగ్స్ కూడా ఇచ్చారు అని బాలు అన్నారు. నాకు స్మోకింగ్ కూడా అలవాటు ఉంది. కానీ కొంతకాలానికి దానిని మానేశాను. నా జీవితంలో దాచిపెట్టడానికి ఏమీ లేదు. నా జీవితంలో ఏదైనా మచ్చ ఉంది అంటే అది కృష్ణ గారితో జరిగిన సంఘటన మాత్రమే. అప్పట్లో కృష్ణ, బాలు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు ఉన్నాయి. కృష్ణ గారిది మంచి మనసు కాబట్టి ఆ వివాదం వెంటనే సమసిపోయింది అని బాలు అన్నారు.