ఇక తెలుగులో కూడా ఆయన హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి డబుల్ యాక్షన్ మూవీ స్నేహం కోసం, బావనచ్చాడు, జై సింహా, రూలర్, ఇలా తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు అందించాడు కెఎస్ రవికుమార్. దర్శకుడిగా మాత్రమేకాదు.. నిర్మాతగా.. రచయితగా.. నటుడిగా కూడా ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటు దర్శకుడిగా అడపా దడపా సినిమాలు చేస్తున్నారు.