తమిళ నటికి ఆలయం
సినిమా, రాజకీయాలంటే తమిళనాడు జనాలకు పిచ్చి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నటులను ఆరాధిస్తారు. ఈ క్రమంలో అభిమానులు కొందరు హీరోయిన్స్ కి ఆలయాలు నిర్మించారు.
నిధి అగర్వాల్
2022లో చెన్నైలో నిధి అగర్వాల్ అభిమానులు ఆమెకు ఆలయం నిర్మించి, ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. నిధి స్టార్ హీరోయిన్ కూడా కాదు. తమిళంలో మూడు సినిమాలు మాత్రమే చేసింది. అవి పెద్దగా ఆడలేదు. అయినా ఆమెకు అక్కడ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
సమంత
ఆంధ్రప్రదేశ్‌లోని అలపాడు గ్రామంలో సమంత రూత్ ప్రభు అభిమానులు ఆమెకు ఆలయం నిర్మించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. తమిళ అమ్మాయి అయిన సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఖుష్బూ
1988లో ధర్మాతిన్ తలైవన్ అనే తమిళ చిత్రంతో ఖుష్బూ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత, ఆమె అనేక దక్షిణ భారత చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందారు. సౌత్ ఇండియాలో గుడి కట్టిన మొదటి నటి ఖుష్బూ సుందర్ కావడం విశేషం. అయితే, వివాహానికి ముందు లైంగిక సంబంధాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, కుష్బూ గుడిని 2005లో కూల్చి వేశారు.
నమిత
తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన నటి నమిత 1981 మే 10న గుజరాత్‌లో జన్మించారు. 2008లో నమిత కెరీర్ పీక్స్ లో ఉంది. అప్పుడు తమిళనాడులో ఒక అభిమాని ఆలయం నిర్మించాడు, ఖుష్బూ అనంతరం గుడి కట్టబడిన నటిగా నమిత రికార్డులకు ఎక్కింది.
హన్సిక మోట్వాని
హన్సిక మోట్వాని చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పడికథవన్ చిత్రంతో కొలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు, ప్రేక్షకులు హన్సికను నటి ఖుష్బూ సుందర్‌తో పోల్చడం విశేషం. హన్సిక అభిమానులు మధురైలో ఆలయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు.2012లో హన్సిక తనకు గుడికట్టాడని వ్యతిరేకించారు. దాంతో అభిమానులు ఆలోచన విరమించుకున్నారు.
నయనతార
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఆలయం నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చాయి. ఆలయం నిర్మించడానికి అనుమతి కోసం అభిమానులు నటిని సంప్రదించినప్పుడు, సున్నితంగా తిరస్కరించారు. ఆమె మూకుతి అమ్మన్ అనే తమిళ చిత్రంలో దేవత పాత్ర పోషించారు.