తెలుగు అమ్మాయి సోనియా ఆకుల జార్జి రెడ్డి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ చిత్రంలో హీరో చెల్లి పాత్ర చేసింది. దర్శకుడు ఆర్జీవీ ఆమెకు లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దిశా ఎన్కౌంటర్ మూవీలో సోనియా ఆకుల నటించింది.
అలాగే కరోనా వైరస్ చిత్రంలో కూడా సోనియా ఆకుల నటించారు. నటిగా కొనసాగుతూనే ఆమె సోషల్ వర్కర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఈ క్రమంలో యష్ పాల్ పరిచయం అయ్యాడు. అమెరికాలో ఉండే యష్ పాల్, సోనియా కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ కి పని చేశారట. రెండేళ్లకు పైగా పరిచయంలో ప్రేమ చిగిరించిందట. తమ కంటే కూడా సోనియా, యష్ పెళ్లి విషయంలో పేరెంట్స్ స్టెప్ తీసుకున్నారట.