అంతా శర్వానంద్ అనుకుంటారు, నితిన్ ఆస్తుల గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. తన భార్య వచ్చాక మరింతగా.. 

First Published | Nov 23, 2024, 12:49 PM IST

నితిన్ ఎప్పుడూ కోట్లకి అధిపతి లాగా కనిపించడు. చాలా సింపుల్ గా ఉంటాడు. నితిన్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. 

టాలీవుడ్ లో అత్యంత ధనవంతులుగా రాంచరణ్, నాగ చైతన్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు. వీళ్ళందరికీ బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. అయితే శర్వానంద్ లాంటి కొందరు యువ హీరోల ఆస్తుల గురించి ఇప్పుడిప్పుడే వివరాలు బయటకి వస్తున్నాయి. శర్వానంద్ తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తుల ప్రకారం కుబేరుడు అని చెప్పాలి. 

శర్వానంద్ అంత రేంజ్ లో కాకుండా వందల కోట్లల్లో ఆస్తులు ఉన్న మరో యువ హీరో నితిన్. కానీ నితిన్ ఎప్పుడూ కోట్లకి అధిపతి లాగా కనిపించడు. చాలా సింపుల్ గా ఉంటాడు. నితిన్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్నారు. 


2002లో జయం చిత్రంతో నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో నితిన్ కొంత బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాడు. ఇటీవల నితిన్ సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. నితిన్ కి తన తండ్ర నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులు మొత్తం కలిపి 200 కోట్ల విలువ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 

నితిన్ కి 2020లో షాలిని కందుకూరితో వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెద్దలని ఒప్పించి వివాహం చేసుకున్నారు. షాలిని కూడా ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయే. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ వృత్తిలో ఉన్నారు. షాలినికి తన తల్లిదండ్రుల నుంచి 50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఆ విధంగా నితిన్ షాలిని దంపతులకు 250 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయి. 

నితిన్ రూ. 1.20 కోట్ల విలువైన పోర్షే కయోన్, 60 లక్షల జాగ్వార్ కారు, మరో మూడు కాస్ట్లీ లగ్జరీ కార్లు నితిన్ గ్యారేజ్ లో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో నితిన్ కి సొంత నివాసం ఉంది. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

Latest Videos

click me!