బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, మోనను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అప్పటికే నటి శ్రీదేవితో బోనీ కపూర్ ప్రేమలో పడ్డారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ముందే బోనీ కపూర్, శ్రీదేవి సంబంధంలో ఉన్నారు. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి అయ్యారని కూడా చెబుతారు. తర్వాత మోనకు విడాకులిచ్చిన తర్వాత శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్.