రాజకీయాల్లోకి రాగానే సీఎంలు అయిపోరు.. చిరంజీవికి విజయశాంతి చురకలు.. హీరోలంతా ముసుగు దొంగలంటూ స్టేట్ మెంట్

Published : Jul 09, 2024, 07:20 PM ISTUpdated : Jul 10, 2024, 12:54 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి.. తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాడు మెగాస్టార్‌ చిరంజీవిపై కూడా ఆమె సెటైర్లు పేల్చింది. 

PREV
18
రాజకీయాల్లోకి రాగానే సీఎంలు అయిపోరు.. చిరంజీవికి విజయశాంతి చురకలు.. హీరోలంతా ముసుగు దొంగలంటూ స్టేట్ మెంట్

 తెలుగులో ఎంత మంది హీరోయిన్లు వచ్చినా, హీరోయిన్‌ పాత్రకి సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చిన ఘనత విజయశాంతికే దక్కుతుంది. ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడం, స్టార్‌ హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పించడం విశేషం. మరోవైపు తాను మెయిన్‌ లీడ్‌గా చేసిన సినిమాలు స్టార్‌ హీరోల చిత్రాలకు ధీటుగా విడుదల కావడమే కాదు, కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. 

28

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ హీరోయిజం చూపించిన ఘనత విజయశాంతికే దక్కుతుంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కమర్షియల్‌ హీరోయిన్‌ నుంచి మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసి కెరీర్‌ పీక్‌ స్టేజ్‌ని చూసింది. `కర్తవ్యం`, `ఒసేయ్‌ రాములమ్మ` వంటి సంచలన చిత్రాలు చేసి మెప్పించింది. కెరీర్‌ లో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా తన మార్క్ ని చూపించింది. 

38

ఎన్నికల్లోనూ విజయం సాధించింది. కానీ ఇప్పుడే ఆమె రాజకీయంగా మనుగడ కోల్పోతుంది. యాక్టివ్‌ పాలిటిక్స్ లో లేకపోవడంతో నేటి రాజకీయాల్లో సర్వైవ్‌ కావడం కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో హడావుడి చేసిన ఆమె మళ్లీ కనిపించడం లేదు. కానీ ఆమె పాత ఇంటర్వ్యూ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో స్టార్‌ హీరోలపై ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. 
 

48

చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడానికి సంబంధించిన విజయశాంతి అప్పట్లో విమర్శలు చేసింది. దానిపై యాంకర్‌ ప్రశ్నించగా, ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, ప్రజల తరఫున పోరాడలేనప్పుడు కచ్చితంగా వేలెత్తి చూపిస్తాం. ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను స్పందిస్తానని, వేలెత్తి చూపిస్తానని తెలిపింది విజయశాంతి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ గురించి ఆమె షాకింగ్‌ కామెంట్ చేసింది. 

58

ఈ ఇంటర్వ్యూ తెలంగాణ రాకముందు చేసిన కావచ్చు. ఇందులో తెలంగాణ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా తారలు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని, తెలంగాణ ప్రజలు ఆదరించం వల్లే ఇంత పెద్ద హీరోలయ్యారు. వాళ్లు ఇచ్చే డబ్బులతోనే ఇంతటి పారితోషికాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడిగితే,  ఎవరూ ముందుకు రాలేదని, ఎవరూ స్పందించలేదని వాపోయింది.
 

68

వాళ్లు స్వార్థంతోనే స్పందించలేదని చెప్పింది విజయశాంతి. హీరోలకు గట్స్ లేవని అనుకుంటున్నానని, సినిమాల్లోనే హీరోలు కాదు, బయటకు కూడా హీరోలుగానే ఉండాలని, సినిమాల్లో సమాజానికి సేవ చేశానని చెప్పడం, కాదు బయటకు కూడా చేయాలని అన్నది విజయశాంతి. కనీసం 20శాతం అయినా కూడా చేయడం లేదని, అంతా ముసుగు దొంగలు` అంటూ హాట్‌ కామెంట్‌ చేసింది విజయశాంతి. ఒక్కరు కూడా సేవ చేస్తున్నవాళ్లు లేరు అని చెప్పింది. 
 

78
Chiranjeevi and Vijayashanti

ఈ క్రమంలో చిరంజీవిపై సెటైర్లు పేల్చింది. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలంటే కుదురుతుందా. రామారావులా అందరు అయిపోవాలంటే సాధ్యమవుతుందా?. రామారావుకి గట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల కోసం పనిచేశారు. ఎంతో కష్టపడ్డారు. కానీ మీరు అన్ని సుఖాలకు అలవాటు పడి, ఓవర్‌నైట్‌లో ముఖ్యమంత్రి అయిపోవాలంటే ఎలా సాధ్యం. ప్రజల కోసం కష్టపడాలి, డెడికేషన్‌, కమిట్‌మెంట్ ఉండాలి, ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేశారనేది ఇంపార్టెంట్. వెంటనే పదవులు వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి, చైర్‌లో కూర్చోవాలి అంటే అది స్వార్థం అవుతుందని, సేవ చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రాకూడదని, హాయిగా సినిమాలు చేసుకోవాలని చెప్పింది విజయశాంతి. పరోక్షంగా ఆమె చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని అర్థమవుతుంది. 
 

88

విజయశాంతి, చిరంజీవి కలిసి ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేశాక, చిరుతో చేయడం తగ్గించారు. కానీ ఈ ఇద్దరి కాంబోలో దాదాపు 20 సినిమాలు వచ్చాయి. ఇటీవల `సరిలేరు నీకెవ్వరు` సినిమా ఈవెంట్‌లో ఈ ఇద్దరు మళ్లీ కలుసుకుని గత విమర్శలు సరదాగా మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. మళ్లీ కొంత గ్యాప్‌తో ఇప్పుడు నందమూరికళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories