ఇరవై ఎకరాలు ఇస్తా అనడంతో శోభనానికి రెడీ అయిన `జబర్దస్త్` వర్ష.. అసలు విషయం తెలియడంతో ఫ్యూజులు ఔట్‌

Published : Jul 09, 2024, 08:49 PM IST

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్‌ కలిసి అనేక స్కిట్లు చేశారు. కానీ ఇప్పుడు ఇరవై ఎకరాల కోసం వర్ష చేసిన పని అందరికి షాకిస్తుంది. ఆమెకే మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.   

PREV
17
ఇరవై ఎకరాలు ఇస్తా అనడంతో శోభనానికి రెడీ అయిన `జబర్దస్త్` వర్ష.. అసలు విషయం తెలియడంతో ఫ్యూజులు ఔట్‌
Jabardasth Varsha

జబర్దస్త్ వర్ష.. పాపులర్‌ లేడీ కమెడియన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇమ్మాన్యుయెల్‌తో కలిసి చేసిన స్కిట్లు బాగా వర్కౌట్‌ అయ్యాయి. నవ్వులు పూయించాయి. అంతేకాదు ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకోవడం, లవ్‌ ఎక్స్ ప్రెస్‌ చేసుకోవడం, ఏకంగా పెళ్లికి కూడా రెడీ అవ్వడం హైలైట్‌గా నిలిచింది. జబర్దస్త్ షోని రక్తి కట్టించడంతో ఈ ఇద్దరు కలిసిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయ్యింది. 
 

27

ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని, సుడిగాలి సుధీర, రష్మి మాదిరిగానే వీళ్లు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తున్నారని అంతా భావించారు. కానీ జబర్దస్త్ వర్ష మరో కమెడియన్‌తో స్కిట్లు చేయడంతో ఆమెపై  దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి చేయాలనే డిమాండ్‌ వచ్చింది. విమర్శలు ఎక్కువ కావడం, వ్యక్తిగతంగా కామెంట్లు చేయడంతో  ఆమె కొంత కాలం షోకి దూరమైంది. మళ్లీ తేరుకుని జబర్దస్త్ లోకి వచ్చి ఇతర టీమ్స్ లోనూ మెరుస్తుంది. కానీ మళ్లీ ఇమ్మాన్యుయెల్‌ టీమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇద్దరు జంటగా నటించకపోయినా, ఒకే స్కిట్లో డిఫరెంట్‌గా వినోదాన్ని పంచుతున్నారు. 
 

37

ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ వర్ష చేసిన పని అందరికి షాకిస్తుంది. ఆమె ఓ భూస్వామికి లొంగిపోవడం ఆశ్చర్యంగా మారింది. భూమి ఇస్తానంటే భార్యగా నటించేందుకు రెడీ అయ్యింది. కానీ తీరా శోభనం అని తెలియడంతో షాక్‌ తినాల్సి వచ్చింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. రియాజ్‌ భార్య వర్షకి లైనేస్తున్నాడు పక్కింటి అజార్‌. దీంతో ఈ విషయాన్ని గమనించిన వర్ష.. తన భర్త రియాజ్‌కి చెప్పింది. అతను అజార్‌ పై గొడవకు వెళ్లాడు. 
 

47

నా భార్యని ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా, మా నాన్నకి వంద ఎకరాలుంది. నాకు ఇక్కడ భార్య, కొడుకు ఉన్నాడని అబద్దం చెప్పాను, కానీ ఇప్పుడు చూడ్డానికి నాన్న వస్తున్నాడు, భార్యగా నటించేందుకు ఎవరూ రావడం లేదు. 20ఎకరాలు రాసిస్తా అని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదంటూ వాపోయాడు అజార్‌. రియాజ్‌ కి అదిరిపోయే ప్లాన్‌ వచ్చింది. ఇరవై ఎకరాలంటే మామూలు కాదు, ఒకరోజు అజార్‌కి భార్యగా నటించమి తన భార్య వర్షకి చెబుతాడు. 
 

57

దీంతో మరో ఆలోచన లేకుండా ఇరవైఎకరాల కోసం ఒక రోజున అజార్ కి భార్యగా నటించేందుకు వెళ్తుంది వర్ష. కొడుకుగా, రియాజే వెళ్లడం విశేషం. అయితే ఇంట్లోకి వెళ్లాక.. అజార్‌ తండ్రి(ఇమ్మాన్యుయెల్‌).. కొడుక్కి శోభనం ఏర్పాటు చేస్తుంటాడు.

67

ఎవరికి శోభనం అని రియాజ్‌ అడగ్గా, మీ అమ్మా నాన్నకి అని చెప్పడం విశేషం. దీంతో దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయాయి రియాజ్‌కి. భార్యగా నటించడానికి వెళితే వర్షకి ఏకంగా శోభనం ఏర్పాటు చేశాడు అజార్‌ నాన్న. ఇది విని అందరికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. 
 

77

లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమోలోని ఇమ్మాన్యుయెల్‌ టీమ్‌ స్కిట్‌ ఇది. హిలేరియస్‌గా ఆకట్టుకుంది. ప్రోమోలో అదిరిపోయింది. ఈ వీకెండ్‌ లో ఎలా అలరిస్తుందో చూడాలి. ఇది చూసి అటు యాంకర్‌ రష్మి గౌతమ్‌, జడ్జ్ లు ఖుష్బూ, కృష్ణ భగవాన్‌ బాగా ఎంజాయ్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories