ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను అనడంతో దీప ఎమోషనల్ గా కార్తీక్ ని హత్తుకుంటుంది. ఆ తర్వాత దీప కార్తీక్ ఇద్దరు సౌర్య కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు చంద్రమ్మ దంపతులు సౌర్య వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చేద్దాం సౌజన్య మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసాము అని అనడంతో శౌర్య అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నారో అని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య వాళ్ళు సౌర్య కోసం వెతుకుతుండగా కార్తీక్ వాళ్ళు కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య, సౌర్య వాళ్ళు ఒక చోట కలుసుకుంటారు. అప్పుడు సౌందర్య నా మనవరాలను నాకు అప్పగించిందంటే ఇల్లు కాలు చేసి ఊర్లూర్లు తిరుగుతారా అంటూ కోపంతో రగిలిపోతుండగా సౌర్య సౌందర్యను ఆపుతుంది.