ఒక దశాబ్దం పాటు సౌందర్య సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. అనూహ్యంగా 2004లో కన్నుమూశారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య తన సోదరుడితో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది.