Published : Jul 01, 2024, 05:00 PM ISTUpdated : Jul 02, 2024, 07:07 AM IST
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆయనే బాస్. కానీ ఇంట్లోమాత్రం ఆయనకు బాస్ ఉన్నారట. ఆమె ఏం చెబితే అది చేయాల్సిందేనట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వంలో క్రీయాశిలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే జనంలోకి వెళ్లాడు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే బాధ్యతలు చేపట్టారు. అలాగే మొక్కులు తీర్చుకుంటున్నారు. దీక్షలో ఉన్నా, రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. ఓ రకంగా ఏపీలో సీఎం చంద్రబాబుకి దీటుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు.
26
పవన్ కళ్యాన్ ఓ రకంగా ఏపీకి బాస్. చంద్రబాబుని పక్కన పెడితే పవన్‌ని మించిన వాళ్లు లేరు. ఎవరైనా ఆయన మాట వినాల్సిందే. అంతటి పవర్ సాధించాడు పవన్. ఎన్నికలకు ముందు తనకు పవర్ లేరు, పవర్ స్టార్ ఎందుకు అని ప్రశ్నించి తన సినిమాల్లో ఆ ట్యాగ్‌ని తీసేసుకున్నాడు పవన్. ఇప్పుడు పవర్ వచ్చింది. అది రియల్ పవర్ కావడం విశేషం.
36
డిప్యూటీ సీఎంగా అటు అధికారులకు తన పార్టీ ఎమ్మెల్యేలకు బాస్‌గా రాణిస్తున్న పవన్ కే మరో బాస్ ఉన్నారు. పవన్ కి ప్రధాని మోడీ కూడా స్నేహితుడు. ఆయన్ని కూడా బాస్‌గా భావించడు పవన్. కానీ తనని డిక్టేట్ చేసే వ్యక్తి ఒకరున్నారట. తన ఫ్యామిలీనే ఉండటం విశేషం. ఆమె ఏదైనా ఆర్డర్ వేస్తుందట. దాన్ని పవన్ చేయాల్సిందే. ఏదైనా డిమాండ్ చేస్తుందట. దాన్ని పవర్ స్టార్ చేసి పెట్టాల్సిందే.
46
Pawan Kalyan and Akira Nandan
మరి ఇంతగా డామినేట్ చేస్తుంది వాళ్ల అమ్మ అంజనా దేవినో, వదిన సురేఖనో, అక్కలో కాదు, తన భార్య అన్నా కొణిదెల అంతకన్నా కాదు. నిహారికా కాదు, చిరంజీవి కూతుళ్లు కూడా కాదు. ఆమె ఎవరో కాదు, పవన కూతురు ఆద్య. రేణు దేశాయ్‌కి అకీరా నందన్, ఆద్యలు జన్మించిన విషయం తెలిసింది. కానీ ఈ ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆద్య అమ్మ రేణు దేశాయ్‌తో ఉంటుంది. ఇటీవల పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో ఆయన వెంటనే ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు.
56
ఈ క్రమంలో అటు అకీరా, ఆద్యలు బాగా పాపులర్ అయ్యారు. వార్తల్లో నిలిచారు. అయితే ఆద్య గురించిన ఓ ఆసక్తికర విసయం తెలిసింది. ఆమె పవన్ ఇంట్లో బాస్ రోల్ పోషిస్తుందట. ఎవరినైనా ఎదురించాలంటే తనే అని, తండ్రి వద్ద మాత్రం ఆమె డిమాండ్‌గా ఉంటుందని, ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి, తీసుకురా అని చెబుతుందట. చూడాలనిపిస్తే ఫోన్ చేసి వెంటనే రా డాడీ అంటుందట. ఎవరు ఏం చెప్పినా వినదట. సినిమాలకు సంబంధించిగానీ, ఫ్యామిలీ విషయాలు గానీ, తనని కలిసే విషయాల్లోనూ ఆమె బాస్ రోల్‌ని పోషిస్తుందని చెప్పింది రేణు దేశాయ్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో వెల్లడించింది.
66
Pawan Kalyan and Akira Nandan
పవన్‌కి ముందే ఈ విషయాన్ని చెప్పిందట రేణు. చిన్నప్పుడే ఇంట్లో నీకు బాస్ ఎవరూ కాదు, ఆద్య మాత్రమే. బాగా డామినేట్ చేస్తుందని చెప్పిందట. ఇప్పుడు అదే చేస్తుందని తెలిపింది రేణు దేశాయ్. పవన్ కూడా ఆమె మాటని కాదనడని, ఏదైనా చేస్తాడని తెలిపింది రేణు దేశాయ్. ఈ ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.