మాయాబజార్ చిత్రంలో తనతో పాటు ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీరంగారావు అందరూ హీరోలే అని అన్నారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ మీరు నటించిన హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం అని అడుగుతూ ఇరకాటంలో పెట్టింది. నాకు ఎవ్వరూ ఇష్టం లేదు. నేను పోషించిన స్త్రీ పాత్రలే నాకు ఇష్టం అని ఏఎన్నార్ తెలివిగా సమాధానం ఇచ్చారు.