Karthika Deepam: జ్వాలా తీసుకున్న నిర్ణయానికి షాకైన హిమ.. ఇక హిమ కథ ముగిసినట్టేనా!

Published : Apr 23, 2022, 07:58 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 23వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: జ్వాలా తీసుకున్న నిర్ణయానికి షాకైన హిమ.. ఇక హిమ కథ ముగిసినట్టేనా!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌర్య ను ప్రేమ్ (Prem) కాఫీ తాగడానికి తీసుకుని వెళతాడు. ఆ తర్వాత సౌందర్య ఆనందరావు లు ఆటో కోసం సౌర్య దగ్గరకు వెళతారు. ఇక సౌందర్య సౌర్య (Sourya) ను కొట్టినందుకు సారీ చెబుతుంది. కానీ సౌర్య అవేమి పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడుతుంది.
 

26

ఆటో ఎక్కిన తర్వాత సౌర్య (Sourya) ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతుంది. ఇక సినిమా ధియేటర్ కి అని సౌందర్య విరుచుకుపడుతుంది. వాళ్ళిద్దర్నీ ఆటోలో తీసుకు వెళుతున్న క్రమంలో సౌర్య హిమ (Hima) కు పెళ్లి అయిందో లేదో ఇండైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది. ఇక వీళ్ళని డ్రాప్ చేసిన సౌర్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోదు.
 

36

ఈ లోపు జ్వాల (Jwala) కు నిరూపమ్ ఫోన్ చేసి హాస్పిటల్ కి వస్తావా నీతో ఒకటి మాట్లాడాలి అని అంటాడు. మరోవైపు ప్రేమ్ హిమను కాఫీ తాగడానికి తీసుకొని వెళ్లి అక్కడ హిమ (Hima) కు తెలియకుండా కాఫి లో హార్ట్ షేప్ వచ్చేలా ఆర్డర్ చేస్తాడు. ఇక హిమను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రేమ్ ఆలోచిస్తాడు. 
 

46

హాస్పిటల్ కి వచ్చిన జ్వాల (Jwala) తో ముసలావిడ కోసం మందులు కొనాలంటే బాగా కాస్ట్లీ వి కొనాలి అందుకని నేను ఇస్తున్నాను అని నిరూపమ్ (Nirupam) అంటాడు. కానీ జ్వాల ఆ మెడిసిన్ కు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు నిరూపమ్ కి ఇచ్చేస్తుంది.
 

56

ఇక తిరిగి వెళుతున్న క్రమంలో జ్వాల (Jwala)  నిరూపమ్ ను చూసుకుంటూ నీ మనసు నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ వెళుతుంది. ఒకవైపు సౌందర్య (Soundarya) ఒక చోటికి వెళ్లి మా మనవరాలు చిన్నప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక బొమ్మ గీయాలి అని అంటుంది.
 

66

ఇక ఈ లోపు అక్కడకు జ్వాల (Jwala) వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది. దాంతో సౌందర్య (Soundarya) అసలు విషయం చెబుతుంది. ఇక సౌర్య కూడా హిమ దగ్గరకు వెళ్లి అదే ఆర్టిస్ట్ తో నా శత్రువు బొమ్మ గీపించాలి అని అంటుంది. దాంతో హిమ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories