`అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. పవన్ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్`, బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర`, యమగోల మళ్లీ మొదలైంది`, `గోరింటాకు`, `బంగారు బాబు`, `అ అ ఇ ఈ`, `ఆకాశరామన్న`, `మోక్ష` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించింది. 2016 తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూ `మకల్` అనే సినిమాలో నటిస్తుంది. మరోవైపు తెలుగు, తమిళంలోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది మీరాజాస్మిన్.