ఇక జ్వాలను అడ్రెస్స్, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్తారు. ఆతర్వాత జ్వాల చేంజ్ కోసం అని నిరుపమ్ దగ్గరకు తెలియకుండా వచ్చి చేంజ్ అడుగుతుంది. చాలాసేపు ఫ్లాష్ బ్యాక్ వేసుకొని నిరుపమ్ చేంజ్ ఇస్తాడు. ఇక కారులో ఉన్న హిమ ఏదో అద్భుతం జరిగి వీళ్లిద్దరు కలిస్తే బాగుండు అనుకుంటుంది. ఇక ఆతర్వాత సీన్ లో సౌందర్య, ఆనంద్ రావులు హిమ, సౌర్య గురించి మాట్లాడుతూ బాధ పడుతుంటారు.