నా లైఫ్ లో ప్రేమ, పెళ్ళికి చోటు లేదు.. కానీ సుజాత మాయలో పడింది అప్పుడే, రాకింగ్ రాకేష్ కామెంట్స్

First Published Jul 4, 2022, 7:03 AM IST

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆటో రాంప్రసాద్ , ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు.

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆటో రాంప్రసాద్ , ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వాళ్ళు దూరం అయ్యాక ప్రస్తుతం ఉన్న కామెడియన్లే ప్రేక్షకుల్ని నవ్వించే భారం మోస్తున్నారు. 

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ కూడా సీనియర్ కమెడియన్. దీనితో రాకేష్ కూడా తన బాధ్యతని గుర్తు చేసుకుంటూ మంచి స్కిట్ లతో ప్రేక్షకులని నవ్విస్తున్నాడు. రాకింగ్ రాజేష్, సుజాత లవ్ స్టోరీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకే ఆకర్షణగా మారుతోంది. వీళ్ళిద్దరూ జంటగా ఆడియన్స్ ని భలే ఎంటర్టైన్ చేస్తున్నారు. 

తాజాగా వీరిద్దరూ ఎక్స్ట్రా జబర్దస్త్ లో టైటానిక్ స్పూఫ్ తో అలరించారు. రాకింగ్ రాకేష్ జాక్ గా.. సుజాత రోస్ గా నవ్వులు పూయించారు. షిప్ కెప్టెన్ తో వీరిద్దరి మధ్య సాగే సాగే సంభాషణ హాస్యం పండించే విధంగా ఉంది. ఈ టైటానిక్ షిప్ హైదరాబాద్ లో అమీర్ పేట్, పంజాగుట్ట అన్ని ప్రాంతాలు తిరుగుతుందని చెప్పడం నవ్వులు పూయించే విధంగా ఉంది. 

రియల్ లైఫ్ లవ్ జోడి ఐన రాకేష్, సుజాత మధ్యలో ప్రేమ గురించి చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ స్కిట్ బాగా ఆకట్టుకుంది. ఇటీవల రాకింగ్ రాకేష్ చేసిన స్కిట్స్ లో ఇది ది బెస్ట్ స్కిట్ అంటూ ఇంద్రజ ప్రశంసలు కురిపించారు. 

స్కిట్ పూర్తయ్యాక రాకింగ్ రాకేష్ సుజాతతో తన రియల్ లైఫ్ లవ్ ఎలా మొదలైందో వివరించాడు. సుజాత ఓ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. మధ్యలో నన్ను చాలా ప్రశ్నలు అడిగింది. మీ లైఫ్ లో ప్రేమ ఉందా అని ప్రశ్నించింది. 

నా లైఫ్ లో ప్రేమ పెళ్లి లేవండి.. బేసిక్ గా నేను పెద్ద ఎదవని.. వాటికి విలువ ఇవ్వను అని చెప్పాను. అలాంటి నాకు ఆమె పెద్ద వాల్యూగా మారాయి అని రాకింగ్ రాకేష్ తెలిపాడు. ఇదిలా ఉండగా రాకేష్, సుజాత తమ లవ్ ని నెక్స్ట్ లెవల్ కి ఎప్పుడు తీసుకెళతారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

click me!