బాలయ్యతో సరదాగా మాట్లాడుతూనే అనేక ప్రశ్నలకు అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. బాలయ్య తప్పకుంగా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారని తెలుసు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనికితోడు ఎన్నికల సమయంలో బన్నీ జనసేన పార్టీని కాదని వైసిపిలో తన స్నేహితుడు రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వడంతో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షోలో ఏం మాట్లాడతారు అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు.