SonuSood: మరోసారి రక్షకుడిగా సోనూసూద్.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్స్ కి ఎలా సాయం చేస్తున్నాడంటే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 03, 2022, 10:03 AM IST

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచాన్నే కలవరపెట్టే విధంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా సైనికులు బాంబుల దాడితో విరుచుకుపడుతున్నారు. దీనితో ఉక్రెయిన్ లో పరిస్థితులు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.

PREV
17
SonuSood: మరోసారి రక్షకుడిగా సోనూసూద్.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్స్ కి ఎలా సాయం చేస్తున్నాడంటే..

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచాన్నే కలవరపెట్టే విధంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా సైనికులు బాంబుల దాడితో విరుచుకుపడుతున్నారు. దీనితో ఉక్రెయిన్ లో పరిస్థితులు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఎప్పుడు నెలకొంటుందో అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

27

ఉక్రెయిన్ కి వెళ్లి వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తోంది. కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ ఇండియాకు చేరుకున్నారు. మరికొంతమంది సహాయం కోసం ఉక్రెయిన్ లో ఎదురుచూపులు చూస్తున్నారు. 

37

మార్చి 1న నవీన్ శేఖరప్ప అనే భారత విద్యార్థి ఖార్కివ్ నగరంలో రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఉక్రెయిన్ లో ఉన్న మిగిలిన భారత విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 

47

ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులకు సాయం చేసేందుకు, వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అపర కర్ణుడిగా కీర్తింప బడుతున్న సోనూసూద్ రంగంలోకి దిగాడు. కరోనా సమయంలో సోనూ సూద్ దేశం మొత్తం చేసిన సహాయ కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం, ఆర్థిక సహాయం, ఉద్యోగాలు కల్పించడం, ఆక్సిజెన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు సోనూ సూద్ ఎన్నో చేశారు. 

57

ఇప్పుడు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీని కోసం సోనూసూద్ టీం రంగంలోకి దిగింది. సోనూసూద్ నుంచి సాయం పొందిన భారత విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన శ్రీష్టి సింగ్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. నేను నా స్నేహితులు ముగ్గురం కలసి ఖార్కివ్ నగరంలో ఉండగా సోనూ సర్ టీం మమ్మల్ని కాంటాక్ట్ ఐంది. మేము ఉక్రెయిన్ బోర్డర్ క్రాస్ చేసేందుకు వారు మాకు బస్సు ఆరెంజ్ చేశారు. 

67

ప్రస్తుతం మేము బుడాపెస్ట్ రైల్వే స్టేషన్ లో ఎంబసీ సాయం కోసం ఎదురుచూస్తున్నాం అని శ్రీష్టి సింగ్ పేర్కొన్నాడు. క్రాంజ్ అనే విద్యార్థి మాట్లాడుతూ నేను సోనూ సూద్ సర్ సాయంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాను. ఇక్కడి నుంచి మా స్వస్థలం అహ్మదాబాద్ కి వెళ్లేందుకు కూడా సోనూ సర్ టీం నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది అని పేర్కొన్నాడు. 

77

సోనూసూద్ టీం ఉక్రెయిన్ లో ఉన్న లోకల్ టాక్సీ లని భారత విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. టాక్సీలు, బస్సుల సాయంతో విద్యార్థులు పోలాండ్ బోర్డర్ కి చేరుకునేలా.. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చేలా సోనూ టీం విద్యార్థులకు సాయం చేస్తోంది. దీనితో మరోసారి సోనూ సూద్ పై దేశం మొత్తం ప్రశంసలు దక్కుతున్నాయి. ఆపద ఎక్కడ ఉన్నా సోనూ సూద్ తానున్నానంటూ అభయ హస్తం అందిస్తున్నాడు. 

click me!

Recommended Stories