Nayanthara: `నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కానీ ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో తెలియదు` అంటూ నటి సోనా భావోద్వేగానికి గురయ్యారు. విఘ్నేశ్ వ్యక్తిత్వాన్ని ఆమె మెచ్చుకున్నారు.
బెస్ట్ కపుల్‌గా రాణిస్తోన్న నయనతార, విఘ్నేష్ శివన్
సౌత్ ఇండియాలో 'పవర్ కపుల్' అంటే వెంటనే గుర్తొచ్చేది నయనతార, విఘ్నేశ్ శివన్. ప్రేమ, పెళ్లి, కవల పిల్లలతో వాళ్ల లైఫ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. కానీ, ఈ అందమైన సంసారం మధ్యలో ఇప్పుడు ఓ పాత జ్ఞాపకం ప్రత్యక్షమైంది. ఒకప్పటి 'ఐటెం సాంగ్' క్వీన్ సోనా హైడెన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
26
సోనా, విఘ్నేష్‌కి మధ్య పుకార్లు
అసలు విషయం ఏంటంటే, విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayanthara) పెళ్లికి ముందే 'విక్కీ', సోనా హైడెన్ (Sona Heiden) మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో కోలీవుడ్‌లో పుకార్లు వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరుస్తూ సోనా ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 'విఘ్నేశ్ శివన్ ఒకప్పుడు నా ఆఫీసులో ఏకంగా మూడేళ్లపాటు పనిచేశాడు' అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
36
విఘ్నేష్ రహస్యం వెల్లడి
సోనా చెప్పిన దాని ప్రకారం, విఘ్నేశ్ శివన్ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ఆమె జీవితంలో అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచాడట. 'నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కానీ ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో తెలియదు' అని సోనా ఎమోషనల్ అయ్యారు. విఘ్నేశ్ చాలా మంచివాడని, కానీ అతని జీవితంలో ఓ చిన్న విషాదం (Tragedy) ఉందని, దాన్ని దాటుకుని వచ్చాడని చెప్పి కొత్త ఆసక్తిని రేకెత్తించారు.
విఘ్నేశ్ గురించి మాట్లాడుతూనే, నయనతారపై తనకు ఉన్న అభిమానాన్ని సోనా బయటపెట్టింది. 'నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. ప్రభుదేవాతో బంధం ముగిశాక ఆమె పడిన బాధ నాకు తెలుసు. వాటన్నింటినీ దాటుకుని ఈ రోజు ఓ అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. పిల్లలతో ఆమె సంతోషంగా ఉండటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ల ప్రశాంతతను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు' అని సోనా చాలా హుందాగా మాట్లాడారు.
56
ఆంధ్రావాలాలో ఐటెమ్ సాంగ్‌తో సోనా రచ్చ
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సోనా సుపరిచితమే. 'ఆయుధం', 'ఖళనాయక' సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆంధ్రావాలా' సినిమాలోనూ సోనా కనిపించింది. తన హాట్ డ్యాన్స్ నంబర్స్‌తో అప్పట్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
66
విఘ్నేష్‌తో అప్పటి రోజులను గుర్తు చేసుకొని హాట్ టాపిక్ గా మారిన సోనా
మొత్తం మీద, విఘ్నేశ్ శివన్ పాత రోజుల గురించి సోనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పుడు సోనా ఆఫీసులో పనిచేసిన కుర్రాడే, ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్, లేడీ సూపర్‌స్టార్ భర్త కావడం నిజంగా విచిత్రమే కదా?