Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు

Published : Jun 06, 2026, 08:26 PM IST

టీవీ నటి ప్రియాంక జైన్‌తో పెళ్లిపై స్పందించారు టీవీ నటుడు శివకుమార్‌. తమ డెస్టినీ వెడ్డింగ్‌ గురించి ఓపెన్‌ అయ్యాడు. అంతేకాదు ప్రియాంక అంటే ఎందుకు ఇష్టమో తెలిపాడు. 

PREV
15
గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటోన్న శివ కుమార్, ప్రియాంక జైన్‌

టీవీ సీరియల్‌ నటులు శివకుమార్‌, ప్రియాంక జైన్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసే ఉంటున్నారు. ఇటీవల వీరు స్టార్‌ మా నిర్వహించిన `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` షోలోనూ పాల్గొన్నారు. పది జంటల్లో ఒకరిగా పాల్గొని సందడి చేశారు. తమ ప్రేమ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చాటి చెప్పారు. ఈ షో తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిందని తెలుస్తోంది.

25
ప్రియాంకతో పెళ్లిపై శివకుమార్‌ కామెంట్‌

ఈ నేపథ్యంలో తాజాగా శివకుమార్‌.. తన మ్యారేజ్‌ గురించి వెల్లడించారు. త్వరలోనే మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే పెళ్లికి సంబంధించిన ఆసక్తకిర విషయాన్ని వెల్లడించారు. ప్రియాంక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలిపారు. ఆమెని అమ్మతో పోల్చుకోవడం విశేషం. తమ డెస్టినేషన్‌ మ్యారేజ్‌ గురించి ఓపెన్‌ అయ్యాడు శివ కుమార్‌. పెళ్లికి అందరు చాలా ఖర్చు చేస్తుంటారు. ఆడంబరాలకుపోయి డబ్బులు వృధా చేస్తుంటారు, కానీ తాము అలా చేయడం లేదని, ఎలా చేసుకోవాలనుకునే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు శివకుమార్‌. 

35
యోగి నారాయణ్‌ టెంపుల్‌లో పెళ్లి

ఉత్తరాఖండ్‌లో యోగి నారాయణ్‌ అనే ఒక టెంపుల్‌ ఉంది. అందులోనే శివపార్వతీలు పెళ్లి చేసుకున్నారని అంటుంటారు. ఆ అగ్ని అప్పట్నుంచి ఇప్పటి వరకు అలానే వెలుగుతుంది. నేను శివ్‌, ఆమె నా పార్వతి కాబట్టి మేము కూడా అక్కడే పెళ్లి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు శివకుమార్‌. ఫ్యామిలీతో వెళ్లి అక్కడ మ్యారేజ్‌ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ గ్రాండ్‌గా రిసెప్షన్‌ చేసుకోవాలనుకున్నామని చెప్పారు. అయితే ప్రియాంక ఇంట్లో తనకు బాధ్యతలు ఉన్నాయి, మా ఇంట్లో నాకు బాధ్యతలు ఉన్నాయి. ప్రియాంకకి తమ్ముడు ఉన్నాడు, అతనికి పెళ్లి చేయాలి, నాకూ చెల్లి ఉంది. ఆమెకి మ్యారేజ్‌ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు.

45
పెళ్లి తర్వాత అంతా కలిసే ఉంటాం

అయితే పెళ్లి తర్వాత ఇద్దరి సంపాదన గురించి చెబుతూ, ప్రియాంక, తాను కలిసి ఒక పెద్ద ఇంటిని నిర్మిస్తున్నామని, అందులోనే ప్రియాంక పేరెంట్స్ కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామన్నాడు. తన అమ్మ టీచర్‌ అని, ఆమెకి ఇంకా సర్వీస్‌ ఉందని, ఆ తర్వాత తను కూడా మా ఇంట్లోనే ఉండేలా ప్లాన్‌ చేశామని వెల్లడించారు. అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలన్నారు. ఫ్యామిలీ అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, వాటిని తట్టుకొని, అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలి అని తెలిపారు.

55
ప్రియాంకని అమ్మతో పోల్చుకున్న శివకుమార్‌

ప్రియాంకలో తనకు నచ్చిన క్వాలిటీ గురించి చెబుతూ,   నేను ఎలా ఉంటే అలా ఇష్టపడుతుంది. చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది. ఆమె తనకు చాలా స్పెషల్‌ అని, అదే సమయంలో ఆమెనే సర్వస్వం అని చెప్పాడు శివ కుమార్‌. తను అమ్మలా చూసుకుంటుంది. మా అమ్మ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్‌ పర్సన్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే, ఆమె డిట్టో మా అమ్మనే అని తెలిపారు శివకుమార్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories