Ramesh Babu: మహేష్ బాబు అన్నయ్య, కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాలేదు. కానీ ఒక్క మూవీ చేస్తే ఆయన సూపర్ స్టార్ అయ్యేవాడు. మరి ప్రారంభమై ఆగిపోయిన సినిమా ఏంటంటే?
సూపర్ స్టార్ కృష్ణకి ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కొడుకు రమేష్ బాబు సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆయన హీరోగా సక్సెస్ కాలేదు. నిర్మాతగానూ సక్సెస్ కాలేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. కొన్నాళ్లపాటు అనారోగ్య సమస్యలతో బాధపడి కన్నుమూశారు. నాలుగేళ్ల క్రితమే ఆయన మరణించారు.
25
సక్సెస్ లేకపోవడంతో సినిమాలకు రమేష్ బాబు గుడ్ బై
అయితే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రమేష్ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాలు చేసి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ సినిమాలు చేశాడు. `సామ్రాట్` చిత్రంతో హీరోగా మారాడు. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ ఆడలేదు. ఆ తర్వాత `చిన్నికృష్ణుడు` చేసినా ప్రయోజనం లేదు. `బజార్ రౌడీ` అనే మూవీతో డీసెంట్ హిట్‌ని అందుకున్నాడు. `కళియుగ కర్ణుడు`, `ముగ్గురు కొడుకులు` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోగా పదికిపైగానే సినిమాలు చేశాడు. కానీ అవి రమేష్ బాబుకి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. హీరోగా నిలబెట్టలేకపోయాయి.
35
హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం
దీంతో సినిమాలు మానేశాడు. 1997లో చివరగా ఆయన `ఎన్‌కౌంటర్` చిత్రంలో మెరిశారు. ఆ తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా మారాడు. `సూర్యవంశం`, `అర్జున్`, `అతిథి`, `దూకుడు`, `ఆగడు` వంటి చిత్రాలను నిర్మించాడు. `అర్జున్`, `దూకుడు` పెద్ద హిట్ అయ్యాయి. `ఆగడు`తో నష్టపోవాల్సి వచ్చింది. దీంతో నిర్మాణానికి కూడా గుడ్ బై చెప్పాడు. అయితే రమేష్ బాబు హీరోగా నిలబడటానికి, ఆయన్ని సూపర్ స్టార్‌ని చేసే మంచి కంటెంట్ ఒకటి ప్లాన్ చేశారు. మహేష్ బాబు చేతుల మీదుగా ఓపెనింగ్ కూడా చేశారు. కానీ సినిమా ఆగిపోయింది. రమేష్ బాబు కెరీర్ కూడా ఆగిపోయింది.
రమేష్ బాబు కెరీర్‌ని దెబ్బకొట్టిన మూవీ ఏంటనేది చూస్తే, అది `భూలోక వీరుడు జగదేక సుందరి`. ఇందులో రమేష్ బాబు హీరోగా, ఇంద్రజ హీరోయిన్. వీరిద్దరిపై సినిమా ఓపెనింగ్ జరిగింది. వారి పాత్రల గెటప్‌లోనే ఓపెనింగ్ ని చేశారు. మహేష్ బాబు క్లాప్ కొట్టారు. బాబా మూవీ చిత్ర బ్యానర్ పై ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. 1999 జూన్ 24న ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. దీనికి జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ దర్శకుడు. ఫోక్, ఫాంటసీ బ్యాక్ డ్రాప్, భారీ సెట్స్, జానపద అంశాలతో సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ అనుకోకుండా ఆపేశారు. కారణం ఏంటోగానీ ఈ సినిమా విడుదలై ఉంటే రమేష్ బాబు పెద్ద స్టార్ అయిపోయేవాడు, ఆయన కెరీర్ మారిపోయేది, సూపర్ స్టార్‌గా ఎదిగేవారు అని అంటుంటారు. కానీ అంతా తలక్రిందులయ్యాయి. ఈ దెబ్బతో ఆయన ఇక సినిమాలు చేయడమే మానేశారు.
55
సూపర్ స్టార్ అయిన తమ్ముడు మహేష్
అన్న స్టార్ కాలేకపోయారు. కానీ తమ్ముడు మహేష్ బాబు చేసి నిరూపించారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి నిలబడ్డాడు. `మురారి`తో హిట్ అందుకున్నాడు. `ఒక్కడు`తో బ్రేక్ అందుకున్నాడు. `పోకిరి`తో సూపర్ స్టార్ అయిపోయాడు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు`, `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహర్షి` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఇది అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీతో మహేష్ రేంజ్ మారబోతుందని చెప్పొచ్చు.