Chinmayi Sripaada : సమాజం రేపిస్టులనే ప్రేమిస్తుంది..! ట్వీట్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఆవేదన

First Published Jan 16, 2022, 10:44 AM IST

డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లేబ్యాక్ సింగర్‌ చిన్మయి రేపిస్టులకు సప్టోర్ చేస్తున్న సమాజంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐదున్నరేండ్ల కింద ప్రముఖ మలయాళం హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఆ హీరోయిన్ కు మద్దతుగా నిలిచే క్రమంలో నటి పార్వతి లాంటి వాళ్లు తమ కేరీర్ ను కోల్పోతున్నారని చిన్మయి ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసింది. 
 

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా చిన్మయి  డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లేబ్యాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా బోల్డ్ కామెంట్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. నటుడు రాహుల్ రవీంద్రన్‌ను పెళ్లాడిన చిన్మయి... సమంత, లావణ్య త్రిపాఠి, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వాళ్లకు గాత్రదానం చేస్తుంది. సమంతకు నటిగా వచ్చిన గుర్తింపులో సగం క్రెడిట్ చిన్మయికి దక్కుతుంది.   
 

అయితే చిన్మయి తన కేరీర్ తో పాటు ఇతరుల జీవితాలను, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా స్పందిస్తూ ఉంటుంది.  కొన్ని సందర్భాల్లో తన స్టైల్ లో కొన్ని విషయాల్లో స్పందించి వివాదాలకు కూడా గురైంది చిన్మయి. కానీ చిన్న సోషల్ మీడియాలోని పలువురు బాధితులకు మద్దతుగా నిలవడం, తన తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ అండగా ఉండటంతో కొందరు చిన్మయికి సపోర్ట్ చేస్తున్నారు. 

అయితే ఐదేండ్ల కింద మలయాళ ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచనం రేపింది. కాగా ఈ కేసు ఇటీవల కాలంలో ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో  ఘటనను ఖండిస్తూ చాలా మంది హీరోయిన్లు, ప్రముఖులు తమ మద్దతును బాధిత హీరోయిన్ కు అందించారు. వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ కూడా ఉన్నారు. 
 

ఘటనకు వ్యతిరేకంగా, బాధిత హీరోయిన్ కు న్యాయం చేయాలని కోరుతూ అప్పట్లో నటి పార్వతి  పోరాడింది. కొద్ది రోజుల తర్వాత పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. పార్వతి బాధిత హీరోయిన్ కు మద్దతుగా నిలుస్తున్న క్రమంలో తన వెంట చాలా మంది నడిచారు. అంత మంది సపోర్ట్ గా నిలిచినా తను కోల్పోవాల్సింది కోల్పోయానని ఇటీవల ఓ చానెల్ ఇంటర్వూలో పేర్కొంది. 
 

ఆ పోరాటం తర్వాత తనకు మూవీ ఆఫర్లు రావడం క్రమక్రమంగా తగ్గాయని తెలిపింది. ఒక రకంగా నిజం మాట్లాడినందుకు, మద్దతుగా నిలిచినందుకు తనకు బెదిరింపులు అందాయని తెలిపింది. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది. ఇటీవల మమ్మూట్టీ, పార్వతి తిరువోత్ నటించిన ‘పుజ్ హ్’ మూవీ ట్రైలర్ రిలీజైంది.  
 

కాగా వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉండే పార్వతి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన చిన్మయి ఆవేదన చెందింది. తన ట్విట్టర్ ఖాతాలో ఘాటుగా ట్విట్ చేసింది.  ‘బాధిత హీరోయిన్ కు మద్దతుగా మాట్లాడినందుకు ప్రతభ ఉన్నటువంటి నటి పార్వతి తిరువోత్ తో పాటు ఇతరులూ పని కోల్పోవాల్సి వస్తోంది. కేరళలో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి కోసం నిలబడటం వలన పని కోల్పోయారనేది వాస్తమైనా..  చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. అలా మౌనంగా ఉన్నవారంతా అత్యాచారాలను ప్రేమించే సమాజమే.’ అంటూ ట్వీట్ చేసింది. 
 

ఇదిలా ఉండగా ఇటీవల కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడు దిలీప్ కుమార్, అతని బంధువలపై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. దీనిపై నటి భావన ‘దోషులు తప్పించుకోలేరంటూ’ స్పందించింది. కానీ  ఈనెల 18 వరకు నిందితుడు దిలీప్ కుమార్ ను అరెస్ట్ చేయకూడదని  పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

చిన్మయ్ మాత్రం అటు డబ్బింగ్ అర్టిస్ట్ గా , ప్లేబ్యాక్ సింగర్ గా కొనసాగుతూనే  ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటిప్పుడూ స్పందిస్తోంది. కాగా 2021లో  తెలుగులో రిలీజైన ‘చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్, పాగల్’ లాంటి మూవీలకు డబ్బింగ్ చెప్పింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాలకు పని చేస్తున్నట్టు  సమాచారం. 
 

click me!