భరణితో ఒక ఆట ఆడుకున్న బిగ్ బాస్, హౌస్ లోకి రాకముందే ఎలిమినేషన్, ట్విస్ట్ ఏంటంటే?

Published : Sep 07, 2025, 10:20 PM IST

బిగ్ బాస్ హౌస్ అంటేనే ట్వస్ట్ లు, షాక్ లు కామన్. అవన్నీ హౌస్ లోకి వెళ్లిన తరువాత ఉంటాయి. కాని ఈసారి మాత్రం బిగ్ బాస్ ఎంట్రీలోనే కంటెస్టెంట్ కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంతకీ ఏం జరిగిందంటే? 

PREV
15

తెలుగు ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున మరోసారి తన మార్క్ హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

25

ఈ సీజన్‌లో ఏడవ కంటెస్టెంట్‌గా టెలివిజన్ నటుడు భరణి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. భరణి "స్రవంతి" సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయనకు మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ప్రత్యేకంగా మెగా బ్రదర్ నాగబాబుకు అతను ఆత్మీయుడిగా ఉన్నాడు. భరణి బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చిన వెంటనే స్టేజ్ పై ఓ చిన్న ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. భరణి బిగ్ బాస్ స్టేజ్ మీదకు ఒక బాక్స్ ని తీసుకొని వచ్చాడు. ఆ బాక్స్ తోనే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానని చెప్పాడు. కాని బిగ్ బాస్ హౌస్ లోకి ఏటువంటి వస్తూవులు అనుమతించరని నాగార్జున చెప్పాడు.

35

అయినా సరే ఈ బాక్స్ లేనిదే తాను లోపలికి వెళ్లలేనని ఆయన అన్నారు. బిగ్ బాస్ మాత్రం అలా కుదరదు అని చెప్పడంతో, అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు భరణి. దాంతో బిగ్ బాస్ సైతం మీ ఇష్టం అని చెప్పడంతో నాగార్జున కూడా వెళ్లిపొమ్మని అన్నారు. ఆతరువాత భరణి వెళ్లిపోయాడు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. భరణి వెళ్లిన తరువాత రీతు వర్మ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తరువాత నాగార్జున మళ్లీ భరణిని స్టేజ్ మీదకు పిలిచారు. ఆ బాక్స్ లో తన సెంటిమెంట్ లాకెట్ ఉంది. అది తీసుకెళ్లడానికి బిగ్ బాస్ పర్మీషన్ ఇచ్చారని చెప్పి.. భరణీని హౌస్ లోకి పంపించారు.

45

ఇక స్టేజ్ మీదకు రీ ఎంట్రీ ఇచ్చిన భరణి, తన ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై మాట్లాడుతుండగా, పుషప్ ఛాలెంజ్ తీసుకోవాలని నాగార్జున అన్నారు. దానికి భరణి కూడా వెంటనే స్వీకరించారు. నాగార్జున సమక్షంలో భరణి , డిమోట్ పవన్ కలిసి మొత్తం 60 పుషప్స్ వేయడం గమనార్హం. ఇద్దరిని నాగార్జున ఎంతో మెచ్చుకున్నారు. ఆతరువాత పవన్ కూడా హౌస్ లోకి వెళ్లడానికి కామనర్స్ నుంచి సెలక్ట్ అయ్యాడు.

55

నాగార్జున ఫిట్‌నెస్ గురించి భరణి ప్రశంసించాడు. అందరికి మీరే ఆదర్శం అంటూ వ్యాఖ్యానించారు. ఇక నాగ్ ఫిట్ నెస్ గురించి పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయడం, తన డైట్‌పై కంట్రోల్ కలిగి ఉండడం వల్లే ఆయన ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తారని అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా భరణి చేసిన ఛాలెంజ్ ప్రదర్శనతో నాగార్జున ఇంప్రెస్ అయ్యారు.బిగ్ బాస్ 9లో భరణి ఎలా తన ఆటను కొనసాగిస్తాడో వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories