నాగ చైతన్య తల్లి కోరిక, పెళ్ళికి ముందే శోభిత రెండు పెద్ద త్యాగాలు..ఆమె పేరు మారిపోయిందా..

First Published | Nov 18, 2024, 7:55 AM IST

హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న శోభిత, చైతు వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభం అయింది.

మరికొన్ని రోజుల్లోనే శోభిత ధూళిపాల, అక్కినేని నాగ చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. సమంతతో విడిపోయాక కొన్ని రోజులు సింగిల్ గా ఉన్న నాగ చైతన్య ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు. శోభిత కూడా చైతన్యని ఇష్టపడడంతో వీళ్లిద్దరి రిలేషన్ బలపడింది. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగబోతోంది. ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. 

హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న శోభిత, చైతు వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభం అయింది. దీనితో నాగ చైతన్య, శోభిత వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో చైతన్య మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 


వెడ్డింగ్ కార్డులో నాగ చైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున - అమల.. లక్ష్మి దగ్గుబాటి ఆమె భర్త విజయరాఘవన్ పేర్లు ఉన్నాయి. అయితే నాగ చైతన్య పెళ్లి విషయంలో శోభితకి రెండు పెద్ద త్యాగాలు తప్పడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇకపై శోభిత పేరు మారిపోతోందట. పెళ్లి తర్వాత వధువు పేరు ముందు పెళ్ళికొడుకు ఇంటి పేరు చేరడం సహజం.. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. కానీ ఇంటి పేరు గురించి ఇక్కడ చర్చ కాదు.. శోభిత అసలు పేరే మారుతోందట. ఇక నుంచి ఆమె పేరు లక్ష్మి శోభిత అని ఉండబోతున్నట్లు టాక్. 

శోభిత పూర్తి పేరే అదా లేక పెళ్లి కోసం పేరు మారుస్తున్నారా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా శోభిత పేరు మారడం అయితే ఖాయం అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం కూడా వైరల్  అవుతోంది. మేకప్ విషయంలో శోభిత కాంప్రమైజ్ కాక తప్పడం లేదు అని టాక్. నాగ చైతన్య ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట. పెళ్లిళ్ల విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్ట్ లని హైర్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లో అలియా,ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు తమ పెళ్లిళ్లలో మేకప్ కోసం భారీ మొత్తం ఖర్చు చేశారు. 

కానీ నాగ చైతన్య తాతగారి లెగసీ గౌరవిస్తూ శోభిత సాంప్రదాయ బద్దంగా నేచురల్ మేకప్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి కోరిక కూడా ఉందట. నాగ చైతన్య తల్లి కోరిక మేరకు శోభిత పెళ్ళిలో ఫారెన్ బ్రాండ్లు కాకుండా.. కాంచీవరం చీరలు, జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తనకి చెందిన కొంత జ్యువెలరీని లక్ష్మి డబ్బుబాటి పెళ్ళిలో శోభితకి ఇవ్వబోతున్నట్లు టాక్. మొత్తంగా కాబోయే అక్కినేని కోడలికి ఇప్పటి నుంచే కాంప్రమైజ్ లో తప్పడం లేదు. కానీ శోభిత వీటన్నింటినీ సంతోషంగా స్వీకరిస్తోంది. సాంప్రదాయంగా వివాహం జరగడమే తనకి ఇష్టం అని ఆల్రెడీ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Latest Videos

click me!