నాగ చైతన్య కంటే ముందు శోభిత ఎఫైర్ నడిపింది ఎవరితో...? అతనికి ఎందుకు బ్రేకప్ చెప్పింది..? నిజమెంత..?

First Published | Aug 10, 2024, 4:59 PM IST

నాగచైతన్య కంటే ముందే శోభిత మరొకరితో ప్రేమలో పడిందా.. నాగచైతన్యకు సమంతతో విడాకులు అయినట్టే.. శోభిత కూడా తన బాయ్ ఫ్రెండ్  తో బ్రేకప్ చెప్పిందా..? ఇంతకీ ఎవరతను..? నిజం ఏంటి..? 

ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కటే న్యూస్.. నాగచైతన్య ‌- శోభిత ధూళిపాళ ప్రేమ.. నిశ్చితార్ధం.. త్వరలో పెళ్ళి.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపక్. సమంతతో విడాకులు తరువాత మూడేళ్లు శోభితతో డేటింగ్ చేశాడు నాగచైతన్య. ఇద్దరు రహస్యంగా ప్రేమించుకోవాలి అని చూసినా.. ఏదో ఒక సందర్భంలో దొరికిపోక తప్పదు కదా..అలా ఫారెన్ ట్రిప్ లో దొరికిపోయారు ఈ ఇద్దరు స్టార్స్. కాగా వీరి నిశ్చితార్ధం సందర్భంగా వీరికి సబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు చైతూ, శోభిత. నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా.. దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా మూడుముళ్ళ బంధంతో ఒక‌టి కాబోతున్న కొత్త జంట‌కు ఇండస్ట్రీ నుంచి స్టార్స్ తో పాటు.. ఫ్యాన్స్ కూడా  బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 


Actress Shobita Dhulipala

అయితే నాగ చైతన్య సమంత పెళ్లి విడాకుల గురించి అందరికి తెలిసిందే.. కాని శోభిత ఇంతకు ముందు ఎవరితోనో ప్రేమలో పడినట్టు మీకు తెలుసా..? శోభిత ప్రేమించి బ్రేకప్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరు..? అతను ఇండస్ట్రీకి చెందిన వాడేనా..? ఇలా ఆమె గురించి తెలుసుకోవడం కోసం  అక్కినేని ఫ్యాన్స్ మ‌రియు నెటిజన్స్ తెగ ఉత్సాహం చూపుతున్నారు

Shobita Dhulipala

ఈ క్ర‌మంలోనే శోభిత ధూళిపాళ్ల పాస్ట్ ల‌వ్ స్టోరీ గురించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగు అమ్మాయి అయిన శోభిత.. బాలీవుడ్ లో మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది..? మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత‌.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్క‌డ గుర్తింపు సంపాదించుకుంది.

మోడ‌ల్ గా ఉన్న రోజుల్లో ప్రణవ్‌ మిశ్రా అనే వ్య‌క్తితో శోభిత ప్రేమ‌లో ప‌డిందట. ఇతను ఎవరో కాదు.. ఫేమస్  ఫ్యాషన్‌ డిజైనర్.. లగ్జరీ బ్రాండ్‌ హ్యూమన్‌ కో-ఫౌండర్‌. ఓ ఫ్యాషన్‌లో షోలో కలుసుకున్న వీరు.. ఆతరువాత ప్రేమికులుగా మారారట.  ప్ర‌ణ‌వ్ మిశ్రాతో శోభిత‌ ప‌రిచ‌యం  ప్రేమగా మారి..  చాలా కాలం వీరు డేటింగ్ చేశారట.  ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో ప్ర‌ణ‌వ్ మిశ్రాకు శోభిత బ్రేక‌ప్ చెప్పింద‌ని  బాలీవుడ్ మీడియా అప్పట్లో వైరల్ అయ్యింది. 
 

Latest Videos

click me!