Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ

Published : May 31, 2026, 08:50 PM IST

నాగచైతన్య తో తన రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలు, ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందన్న విషయాన్ని శోభితా ధూళిపాళ తాజాగా షేర్ చేసుకుంది.  ప్రేమ, జీవితంపై తన అభిప్రాయాలను క్లియర్ కట్ గా చెప్పేసింది,  బయటి ప్రపంచంపై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది.

PREV
13
రూమర్స్ పై స్పందించిన శోభిత..

నాగచైతన్యతో పెళ్లికి చాలా కాలం ముందు నుంచే తమ రిలేషన్‌షిప్‌పై విపరీతమైన ప్రచారం జరిగిందని శోభిత శోభితా ధూళిపాళ అంగీకరించింది. అయితే, ఈ అనుభవం తనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని, బయటివారి అభిప్రాయాలతో ప్రభావితం కాకూడదని తెలుసుకున్నానని చెప్పింది. రూమర్స్ పై స్పందించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ అనిపించలేదని, తన జీవితంపైనే దృష్టి పెట్టానని శోభిత తెలిపింది. కాలక్రమేణా, తనపై తనకు మరింత నమ్మకం పెరిగిందని, భిన్నమైన అభిప్రాయాలను పట్టించుకోకుండా జీవించడం అలవాటు చేసుకున్నానని ఆమె వివరించింది. 

23
బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి కారణం..

ప్రజల అభిప్రాయాలు, వివాదాల గురించి శోభిత మాట్లాడుతూ.. అవి తాత్కాలికమైనవని చెప్పింది. సామాజిక చర్చలను మారుతున్న వాతావరణంతో పోల్చింది. ఈ రోజు మనల్ని ఇబ్బంది పెట్టే విషయం, రేపటికి కనుమరుగైపోవచ్చని ఆమె సూచించింది. తనకు ముఖ్యం తనపై తాను దృష్టి పెట్టడమేనని, క్షణికమైన స్పందనలకు ఎక్కువ ఇంపార్టెన్స్  ఇవ్వనని చెప్పింది. నిరంతరం ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ, ఈ ఆలోచనా విధానమే తనను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచిందని శోభిత పేర్కొంది.

33
ప్రేమపై స్పష్టమైన ఆలోచన

వివాహ జీవితం గురించి శోభిత తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ప్రేమపై ఆమెకు స్పష్టమైన ఆలోచన ఉంది. ప్రతి వ్యక్తి తనకు తానుగా సంపూర్ణుడని, భాగస్వామి మనల్ని 'పూర్తి చేయడానికి' రారని ఆమె నమ్ముతుంది. అర్థవంతమైన సంబంధాలు మన వ్యక్తిత్వంలోని దాగి ఉన్న కోణాలను, భావోద్వేగాలను బయటకు తీసుకురావడానికి సహాయపడతాయని శోభిత చెప్పింది. 

ఒకరిలో ఉన్న లోటును మరొకరు పూరించడం కాకుండా, ఇద్దరు సంపూర్ణ వ్యక్తులు ఒకరి ద్వారా మరొకరు తమలోని కొత్త కోణాలను కనుగొన్నప్పుడే ప్రేమ బ్రతుకుతుందని ఆమె అభిప్రాయపడింది. ఇక సినిమాల విషయానికొస్తే, శోభిత త్వరలో 'వెట్టువం' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామాలో కనిపించనుంది. నాగచైతన్య 'వృషభకర్మ' విడుదలకు సిద్ధమవుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories