హెచ్. వినోత్ దర్శకత్వంలో, 'సీఎం విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జననాయగన్' ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్న అభిమానులతో పాటు, ఆడియన్స్ లో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సెన్సార్ సమస్యలే కారణమని నిర్మాత వెంకట్ నారాయణ రెండుసార్లు చెప్పారు. జూన్ 19న వస్తుందనుకుంటే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ 'బాలన్' అనే మరో సినిమాను ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. ఇక దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ఈ సినిమా రావొచ్చని టాక్.
23
నిజం చెప్పే ధైర్యం లేదన్న దర్శకుడు..
ఒక కార్యక్రమంలో 'జననాయగన్' రిలీజ్ గురించి డైరెక్టర్ హెచ్. వినోత్‌ను అడిగారు. దానికి ఆయన, 'సినిమా వచ్చినప్పుడు వస్తుంది. ఆ నిజం చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను చెప్పినా, దాన్ని ప్రచురించే ధైర్యం మీకు (మీడియాకు) లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. వినోత్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ పా. రంజిత్ నవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
33
సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం
ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'జననాయగన్' సినిమా మంచి ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. 'ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి 5 నెలలు పడుతుందా? సినిమాను ఎవరు ఆపుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది' అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.