
హీరోయిన్ శోభితా ఇప్పుడు అక్కినేని కోడలుగా రాణిస్తున్నారు. ఆమె 2024 డిసెంబర్‌లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితాకి కనెక్ట్ అయ్యారు. దాదాపు మూడేళ్లపాటు తమ ప్రేమని రహస్యంగా కొనసాగించి, ఆ తర్వాత ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. చైతూ, సమంత పెళ్లి ఎలా గ్రాండ్ గా చేశారో, అలాగే చైతూ, శోభితా మ్యారేజ్ ని కూడా గ్రాండ్‌గా నిర్వహించాడు నాగార్జున. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని కూడా పంచుకుంది శోభితా.
ప్రస్తుతం నాగచైతన్య, శోభితా దూళిపాళ తమ ఫ్యామిలీ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత శోభితా పెద్దగా బయటకు రాలేదు. మరోవైపు పెళ్లి తర్వాతనే నాగచైతన్యకి హిట్ వచ్చింది. ఆయన గతేడాది `తండేల్`తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు `వృషకర్మ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ పీరియాడికల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. మరోవైపు శోభితా పెళ్లి తర్వాత సినిమాలు మానేసిట్టుంది. ఆమె ఆ తర్వాత మళ్లీ మెరవలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.
శోభితా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం `చీకటిలో` అనే సిరీస్‌లో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా ఈ ట్రైలర్ విడుదలయ్యింది. క్రైమ్ నేపథ్యంలో సీరియల్ కిల్లర్‌గా చుట్టూ సాగుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. ఆ మర్డర్ మిస్టరీలను బయటపెట్టేందుకు న్యూస్ ఛానెల్స్ లో పని చేసే సంధ్య పాడ్ కాస్ట్ పేరుతో సీరియల్ కిల్లర్ వివరాలను, క్రైమ్ జరిగే విధానాన్ని వెల్లడించింది. రెగ్యూలర్ క్రైమ్ స్టోరీతో ఇది సాగేలా ఉంది. కాకపోతే ఇంకా ఏదో రన్ అవుతుంది. అది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.
శోభితా తాజాగా తన భర్త నాగ చైతన్యతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ స్టాఫ్‌కి భోజనాలు ఏర్పాటు చేశారు. చైతూ, శోభితాలు స్వయంగా తమ వర్కర్లకి భోజనాలు వడ్డించడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎల్లో కలర్ శారీలో మెరిసింది శోభితా. చీరలో అదిరిపోయింది. ఎప్పుడూ ట్రెండీ వేర్‌లో మెరిసే ఆమె ఇలా చీరలో కనిపించడంతో చాలా కొత్తగా ఉంది. ఆమె అందం రెట్టింపు అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ లేటెస్ట్ ఫోటోల ద్వారా శోభితా ఓ క్లారిటీ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ రూమర్లకి చెక్ పెట్టింది. శోభితా ఇటీవల శోభితా ప్రెగ్నెంట్‌తో ఉందని, త్వరలో అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబతున్నారని, నాగార్జున తాత కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శోభితాని చూస్తుంటే అలాంటిది ఏం లేదని అర్థమవుతుంది. బేబీ బంప్ ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో ఇది కేవలం రూమరే అనే అనిపిస్తుంది. ఏం స్పందించకుండానే జస్ట్ లుక్‌తోనే రూమర్లకి చెక్ పెట్టింది శోభితా. మరి ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఇప్పుడు శోభితా లేటెస్ట్ లుక్‌ని చూస్తే ఆమె ప్రెగ్నెంట్ కాదనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వార్తలు నాగార్జున చిన్న కోడలు వైపు తిరిగాయి. అక్కినేని అఖిల్ కూడా ఇటీవల వ్యాపారవేత్త జైనాబ్ రవ్జీని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌తో ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మధ్య నాగార్జునకి కూడా చిన్న కోడలి విషయంలోనే మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలో తాత పోస్ట్ కి షిఫ్ట్ అవుతున్నారని అడగ్గా, టైమ్ వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడుతా అన్నారు. ఆయన ఆ వార్తలను ఖండించలేదు. దీంతో తాజా పరిణామాలను బట్టి జైనబ్ ప్రెగ్నెంట్ తో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అఖిల్ ఇప్పుడు `లెనిన్` చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.