BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?

Published : Jan 12, 2026, 02:25 PM IST

BMW First Review: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ మంగళవారం విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే. 

PREV
15
సంక్రాంతి బరిలో రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ

మాస్‌ మహారాజా రవితేజకి హిట్‌ పడి చాలా రోజులు అవుతుంది. `ధమాఖా` తర్వాత ఐదారు సినిమాలు పరాజయం చెందాయి. ప్రతి సినిమాతో ఇక కొడుతున్నామని చెబుతున్నాడు రవితేజ. కానీ ఫలితాలు తేడా కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగాడు. `భర్త మహాశయులకు విజ్ఞప్తి`(బీఎండబ్ల్యూ) మూవీతో వస్తున్నాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. సంక్రాంతి కానుకగా  ఈ నెల 13న(మంగళవారం) విడుదలవుతుంది.

25
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ రివ్యూ

రవితేజ ఈ మూవీతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. తన జోనర్‌ మార్చి సినిమా చేశారు. మాస్‌, యాక్షన్‌ జోనర్‌ని పక్కన పెట్టి ఫుల్‌ ఫ్యామిలీ కథతో వస్తున్నారు. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ సూట్‌ అయ్యే కథతో ఆయన ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ తెలిసిపోయింది. మూవీకి పెద్ద హిట్‌ కాబోతుందట.

35
భర్త మహాశయులకు విజ్ఞప్తి సెన్సార్‌ రిపోర్ట్

ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని `యు ఏ 16 ప్లస్‌` సర్టిఫికేట్‌ని పొందింది. 16 ఏళ్లకుపై పడిన వారు చూడొచ్చు. చిన్న పిల్లలు పేరెంట్స్ సమక్షంలో చూడొచ్చు. సినిమా నిడివి రెండు గంటల 22 నిమిషాలు. అంటే చాలా క్రిస్పీగా ఉంది. షాట్‌ అండ్‌ స్వీట్‌గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పాజిటివ్‌  బజ్‌ ఉన్న నేపథ్యంలో రన్‌ టైమ్‌ కూడా దానికి ప్లస్‌గా మారబోతుందని చెప్పొచ్చు. ఇక సినిమా టాక్‌ పరంగా చూస్తే, రవితేజకి గుడ్‌ టైమ్‌ స్టార్ట్ కాబోతుందట. ఈ సంక్రాంతికి కాలర్‌ ఎగరేయబోతున్నాడట.

45
భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ ఇదేనా?

`భర్త మహాశయులకు విజ్ఞప్తి` కథేంటనేది చూస్తే, రవితేజకి డింపుల్‌ హయతితో పెళ్లి అవుతుంది. ఆయన స్పెయిల్‌ పర్యాటనలో ఉన్నప్పుడు మరో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ పరిచయం అవుతుంది. ఇద్దరు కలుస్తారు. అయితే తనకు పెళ్లి అయిన విషయం ఆమెకి చెప్పకుండా మ్యానేజ్‌ చేస్తాడు. ఈ అక్రమ సంబంధం గురించి భార్యకి తెలియదు. ఇద్దరి మధ్య రవితేజ నలిగిపోతుంటాడు. ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో నిజం ఇద్దరికి తెలిసిపోతుంది. ఇద్దరు అమ్మాయి మధ్య ఎలా నలిగిపోయాడు, వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్లాన్స్ ఎలా బెడిసికొట్టాయనేది, ఈ క్రమంలో జనరేట్‌ అయ్యే కామెడీనే సినిమా అని తెలుస్తోంది.

55
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో హైలైట్స్ ఇవే

సినిమా చూసిన వారి నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం ఇందులో రవితేజ కామెడీ టైమ్‌ బాగా వర్కౌట్‌ అయ్యిందట. ఇటీవల కాలంలో మాస్‌ సినిమాలతో వస్తోన్న రవితేజ మళ్లీ బ్యాక్‌ వెళ్లి తన కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయాడట. డీసెంట్‌గా కనిపిస్తూనే అదరగొట్టాడట. ఆయన నటన కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుందని, నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. రవితేజ కామెడీ చేస్తే వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. అది పర్‌ఫెక్ట్ మీటర్‌లో వర్కౌట్‌ అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి హీరోయిన్ల మధ్య నలిగిపోయే సీన్లు హిలేరియల్‌గా ఉంటాయట. దీనికితోడు వెన్నెల కిశోర్‌, సత్య కామెడీ మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని సమాచారం. దీనికి సుధాకర్‌, మురళీధర్‌ గౌడ్‌లు యాడ్‌ అవుతారని అంటున్నారు. కామెడీ, సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఒకటి రెండు యాక్షన్‌ ఎపిసోడ్లు మేళవింపుగా ఉంటుందని, మొత్తంగా ఫుల్‌ ఫ్యామిలీ ప్యాకేజీ ఫిల్మ్ గా `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఉండబోతుందని అంటున్నారు. సంక్రాంతి సీజన్‌ ఈ మూవీకి మరింత ప్లస్‌ కాబోతుందట. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. పూర్తి జెన్యూన్‌ రిపోర్ట్ కోసం ఏసియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories