టాలీవుడ్ లో అనిల్ రావిపూడి హిట్ మెషీన్ లా మారిపోయారు. సింపుల్ కథలతో, అన్ లిమిటెడ్ వినోదం అందిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయారు అనిల్. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
8 సినిమాలు చేస్తే అన్నీ హిట్లు.. ఇప్పుడు 9 వ చిత్రం రిలీజ్ అయింది. అది కుడి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటి అని అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకోవడం సాధారణమే. ఇదంతా ఎవరి గురించి ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి గురించే.
25
మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ రెస్పాన్స్
అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కంటే వినోదం ప్రధానంగా ఉంటుంది. చిరంజీవి సినిమాకి కూడా అనిల్ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. మన శంకర్ వరప్రసాద్ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి ఇక కాసుల వర్షం ఖాయం అనిట్రెండ్ పండితులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ తొలి రోజు వసూళ్ల జోరు కూడా ఒక రేంజ్ లో ఉంది.
35
అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో ?
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ ఏడాది చిరంజీవి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి ? ఏ హీరోతో చేయబోతున్నారు ? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తున్నారు. వెంకటేష్ తో ఆల్రెడీ 3 సినిమాలు చేశారు. బాలయ్యతో భగవంత్ కేసరి, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు తెరకెక్కించారు.
నియర్లలో ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగ్ తోనేనా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నాగార్జున, అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయినట్లు చెబుతున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. నాగ్ తో మాత్రం సినిమా చేస్తే అనిల్ రావిపూడి రేర్ రికార్డ్ అందుకున్న దర్శకుడిగా మారిపోతారు. డైరెక్టర్ బాబీ చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేశారు.గోపీచంద్ మలినేని వెంకటేష్ బాలయ్య లతో చేశారు.
55
రేర్ రికార్డుకి చేరువలో
ఈ తరం దర్శకులు ఎవరికీ ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేసిన రికార్డ్ లేదు. ఆ రికార్డ్ కి అత్యంత చేరువలో ఉన్నది మాత్రం అనిల్ రావిపూడే అని చెప్పాలి. డైరెక్టర్ వివి వినాయక్ కు సైతం ఆ రికార్డ్ మిస్ అయింది. ఆయన చిరంజీవి, వెంకీ, బాలయ్యలతో సినిమాలు చేశారు కానీ నాగ్ తో చేయలేదు. పాత తరం దర్శకులలో రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ లాంటి వారు ఈ నలుగురితో సినిమాలు చేశారు.