శ్రీదేవి విషయంలో ఆ స్టార్ డైరెక్టర్ కి రామ్ గోపాల్ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్! అసలు ఏం జరిగింది?

First Published | Aug 13, 2024, 11:49 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి ఆరాద్యుడు అన్న విషయం తెలిసిందే. కాగా ఆమె విషయంలో ఓ స్టార్ డైరెక్టర్ కి వర్మ పబ్లిక్ లో వార్నింగ్ ఇచ్చారు. 
 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడు. కెరీర్ బిగినింగ్ లో ఆయన చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇండియన్ సినిమాకు ఫిల్మ్ మేకింగ్ లో కొత్త టెక్నిక్ నేర్పించిన జీనియస్. రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ టాలీవుడ్ ఆల్ టైం ఫేవరేట్ మూవీగా ఉంది. రౌడీయిజంతో కూడిన రాజకీయాలు, స్టూడెంట్స్ తిరుగుబాటు కొత్తగా చూపించాడు.

బాలీవుడ్ పై తన మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాగా వర్మ హీరోయిన్ శ్రీదేవికి భక్తుడు. ఆమె అందానికి దాసోహం అంటాడు. శ్రీదేవి పై తన అభిమానాన్ని చాటుతూ అనేక సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 



రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీదేవి రెండు సినిమాలు చేసింది. నాగార్జునకు జంటగా గోవిందా గోవిందా చిత్రంలో నటించింది. ఇది డివోషనల్ టచ్ తో సాగే క్రైమ్ డ్రామా. ఇక వెంకటేష్-శ్రీదేవి నటించిన క్షణ క్షణం అవుట్ అండ్ అవుట్ క్రైమ్ డ్రామా. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. 

sridevi


కాగా శ్రీదేవి విషయంలో వర్మ ఓ స్టార్ డైరెక్టర్ కి నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఈటీవీలో సౌందర్య లహరి పేరుతో ఓ టాక్ షో ప్రసారమైంది. ఒక ఎపిసోడ్లో శ్రీదేవి, రామ్ గోపాల్ వర్మ, కే రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్క్రీన్ పై ఒక షాట్ ప్రదర్శించారు. అది చూసి వర్మ షాక్ అయ్యాడు. 

Sridevi

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న శ్రీదేవి రోడ్డుమీద పరుగెడుతుంటే కారు ఆమెను తాకుతూ పోతుంది. శ్రీదేవి క్రిందపడిపోతుంది. ఆ సీన్ నేపథ్యం ఏమిటని వర్మ ఆందోళనగా రాఘవేంద్రరావును అడుగుతాడు. రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావ్ దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఓ సన్నివేశంలో ఆమె కారు ప్రమాదం నుండి తప్పుకుంది.

కర్చీఫ్ ఊపగానే శ్రీదేవి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాల్సి ఉంది. రాఘవేంద్రరావు ఆ సీన్ ఇంగ్లీష్ మూవీ తరహాలో చేయాలని రిస్క్ చేశాడట. ఈ క్రమంలో తృటిలో శ్రీదేవి కారు ప్రమాదం నుండి తప్పుకుందట. ఇది విన్న వర్మ... శ్రీదేవికి ఏమైనా అయ్యి ఉంటే నిన్ను నేను చంపేసేవాడిని అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అది సరదా వార్నింగ్ మాత్రమే. వర్మ కామెంట్ కి రాఘవేంద్రరావు, శ్రీదేవి నవ్వేశారు. 
 

Latest Videos

click me!