`నల్లగా ఉన్నావ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికిరావు`.. శోభితా దూళిపాళకి చేదు అనుభవం

First Published | Oct 9, 2024, 1:14 PM IST

శోభితా దూళిపాళ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఎదురైన అవమానాన్ని వెల్లడించింది. 
 

 హీరోయిన్‌ శోభితా దూళిపాళ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె హిందీ సినిమాలతో హీరోయిన్‌గా మారి, ఇప్పుడు తెలుగు, హిందీలో మూవీస్‌ చేస్తూ బిజీగా ఉంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలు, బలమైన పాత్రలతో ఆమె మెప్పిస్తుంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా స్టాంగ్‌ ఉమెన్‌ పాత్రలతో తన ప్రత్యేకత చాటుకుంటుంది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నీ దేనికదే ప్రత్యేకమైనవి. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు కావడం విశేషం. ఇలా హీరోయిన్‌గా తన ప్రత్యేకతని చాటుకుంటుంది శోభితా దూళిపాళ. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గ్లామర్‌తోపాటు, నటనతోనూ మెప్పిస్తుంది శోభితా. సోషల్‌ మీడియాలో ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వాళ్ల అభిమానాన్ని పొందుతుంది. నెట్టింట ఈ తెలుగు హీరోయిన్‌కి మంచి క్రేజ్‌ ఉందని చెప్పొచ్చు. అయితే సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శోభితా చాలా అవమానాలు ఫేస్‌ చేసింది. ఎంతో మంది రిజెక్షన్‌కి గురయ్యింది. అంతేకాదు కలర్‌ డిస్క్రిమినేషన్‌(రంగు వివక్ష)ని కూడా ఫేస్‌ చేసింది శోభితా. నల్లగున్నావ్‌ నువ్వు పనికిరావు అని మోహం మీదనే చెప్పారట. అందరి ముందు దారుణంగా అవమానించారట. ఆ అవమానాన్ని బయటపెట్టింది శోభితా. 
 


తెనాలిలో పుట్టిన శోభితా దూళిపాళ ముంబయిలో డిగ్రీ చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. మోడలింగ్‌ చేయాలనకున్నప్పుడు చాలా మంది అవమానించారట. తెల్లగా లేవని మోడలింగ్‌కి పనికిరావు అన్నారట. ఓ షాంపూ యాడ్‌ చేయడానికి ఆడిషన్‌కి వెళితే, నువ్వు బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ దారుణంగా అవమానించారట. అంతటి మాట అనడంతో ఇంటికెళ్లి అందంలో ఫేస్‌ చేసుకుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని తెలిపింది శోభితా. నెమ్మదిగా ఆ ఆలోచనల నుంచి బయటపడి, అందం అనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించినది కాబట్టి, ఎవరు ఏమనుకుంటారనేది ఆలోచించడం మానేసిందట. తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే అని నిర్ణయించుకుందట. 
 

తన ఫ్రెండ్స్ తనని బాగా ఎంకరేజ్‌ చేశారని తెలిపింది శోభితా. నీ వాయిస్‌ బాగుందని ప్రోత్సహించేవారట. ఎప్పటికప్పుడు వాళ్లు ఇచ్చిన ఎనర్జీతో ఆడిషన్స్ కి వెళ్తూనే ఉందట. మోడల్‌గా, యాడ్స్ చేయడం కోసం, సినిమాల కోసం ఇలా ఏది పడితే దానికి ఆడిషన్స్ కి వెళ్లేదట. ఇలా వందకుపైగానే ఆడిషన్స్ కి అటెండ్‌ అయినట్టు తెలిపింది శోభితా. చివరగా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ `రామన్‌ రాఘవ్‌` సినిమా కోసం ఎంపిక చేసినట్టు తెలిపింది. ఆ తర్వాత తనని రిజెక్ట్ చేసిన ఆ షాంపూ కంపెనీనే ఐశ్వర్యారాయ్‌ కి పక్కన యాడ్‌లో నటించమని అడగడంతోపాటు ఆ షాంపూ యాడ్‌ సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలని అడిగిందట. ఇదే తన సక్సెస్‌ అని గర్వంగా చెప్పింది శోభితా దూళిపాళ. 
 

`రామన్‌ రాఘవ్‌ 2.0` సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో `గూఢచారి`, `మేజర్‌`లోనూ నటించి మెప్పించింది. అలాగే ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌` రెండు పార్ట్ ల్లోనూ మెరిసింది. అదరగొట్టింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. నటిగా బిజీగా ఉంటుంది. వీటితోపాటు `మంకీ మ్యాన్‌` అనే హాలీవుడ్‌ సినిమాలోనూ నటించింది శోభితా. మరోవైపు `కల్కి 2898 ఏడీ` సినిమాలో దీపికా పదుకొనెకి తెలుగులో డబ్బింగ్‌ చెప్పింది శోభితానే కావడం విశేషం. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్న శోభితా త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. ఇటీవలే వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఇక పెళ్లి కూడా త్వరలోనే ఉంటుందని సమాచారం. 

ఆ స్టార్‌ హీరోయిన్‌ భుజంపై చేయివేయడానికే వణికిపోయిన ఏఎన్నార్, ఆమె ఏం చేసిందో తెలిస్తే మతిపోతుంది!

Latest Videos

click me!