పిల్లలని అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదిస్తోంది.. స్టార్ హీరోయిన్ పై నిర్మాత దారుణ వ్యాఖ్యలు

First Published | Oct 9, 2024, 1:02 PM IST

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. 4 పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ నయనతార క్రేజ్ తగ్గడం లేదు.  నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. 

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. 4 పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ నయనతార క్రేజ్ తగ్గడం లేదు.  నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.  గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే నయనతార విషయంలో దర్శక నిర్మాతలకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. 

ఆమె పట్ల నిర్మాతలు ఎంత కోపంతో ఉన్నప్పటికీ కోట్లు కుమ్మరించి ఆమెకే అవకాశాలు ఇస్తున్నారు. నయనతార క్రేజ్ అలాంటింది. నయనతార రెమ్యునరేషన్ తోనే నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ఇది చాలదు అన్నట్లు షూటింగ్ లొకేషన్ కి ఆమెతోపాటు 10 మంది సిబ్బంది వస్తారు. వాళ్ళందరి ఖర్చుకు నిర్మాత భరించాల్సిందే. 


ఇంత చేసిన తర్వాత కూడా ప్రమోషన్స్ కి హాజరవుతుందా అంటే అదీ లేదు. నయనతార ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరు కాదు. ముందే నిర్మాతలకు నయనతార ఈ కండిషన్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఇది చాలదన్నట్లు నిర్మాతలపై కొత్త భారం పడిందట. తమిళంలో నిర్మాత, యూట్యూబర్ అయిన అనంతన్ నయనతారపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

నయనతార, విగ్నేష్ దంపతులకు ట్విన్స్ సంతానం. నయనతారతో పాటు ఆమె పిల్లలు కూడా షూటింగ్ లొకేషన్ కి వస్తున్నారు. వీళ్ళ ఆలనా పాలనా చూసేందుకు నయనతార ఇద్దరు ఆయాలని పెట్టుకుంది. ఇద్దరి ఆయాల ఖర్చు కూడా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నిర్మాతలలే భరించాలని నయన్ కండిషన్ పెట్టిందట. ఇది చాలా దారుణం అని అనంతన్ అంటున్నారు. పిల్లలని అడ్డుపెట్టుకుని కూడా నయన్ ఇలా డబ్బులు సంపాదించడం ఏంటి అని తీవ్రమైన విమర్శలు చేశారు. తమిళనాట అనంతన్ వ్యాఖ్యలు వివాదం అయ్యేలా ఉన్నాయి. 

Latest Videos

click me!