`కల్కి2898ఏడీ`లో శోభితా దూళిపాళ్ల ఉందా? ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. ఈ టాలెంట్ కూడా ఉందా?

Published : Jun 30, 2024, 02:27 PM ISTUpdated : Jun 30, 2024, 02:55 PM IST

`కల్కి 2898 ఏడీ` సినిమాలో చాలా మంది స్టార్స్ మెరిశారు. కానీ ఇందులో గ్లామర్‌ బ్యూటీ శోభితా దూళిపాళ్ల భాగమయ్యింది. ఓ లీక్‌ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.   

PREV
16
`కల్కి2898ఏడీ`లో శోభితా దూళిపాళ్ల ఉందా?  ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..  ఈ టాలెంట్ కూడా ఉందా?

 ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. భారీ వసూళ్ల దిశగా ముందుకు సాగుతుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం నాలుగు వందల కోట్ల మార్క్‌ ని దాటేసింది. మున్ముందు సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. ఇది మొదటి వారంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాభారతం ఎలిమెంట్లు ఉండటంతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు.

26

భారీ కాస్టింగ్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ `కల్కి` సినిమాని తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, రాజమౌళి, వర్మ, అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం వంటి వారు ఇందులో మెరిశారు. తెలియని కొత్త నటులు కూడా ఈ చిత్రం ద్వారా పాపులర్‌ అయ్యారు. `మానస్` పాత్ర, కృష్ణుడి పాత్ర గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.  
 

36

`కల్కి 2898 ఏడీ` సినిమాతో హీరోయిన్‌ దీపికా పదుకొనె బాగా గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి సినిమాలో ఆమె హీరోయిన్‌ కాదు, ఓ బలమైన ఉమెన్‌ పాత్ర. గర్భంతో శతృవులతో పోరాడే పాత్ర. ప్రభాస్‌ కంటే ఆమె పాత్రకే ఎక్కువ స్కోప్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూతే తిరుగుతుంది. ఆమెని పట్టుకునేందుకు సుప్రీం యాస్కిన్‌ సైన్యం, భైరవ ఫైట్‌ చేస్తుంటారు. ఆమెని కాపాడేందుకు అశ్వత్థామ, రెబల్స్ పోరాడుతుంటారు. 
 

46

ఇంతటి బలమైన పాత్రలో మెరిసిన దీపికా పదుకొనె చెప్పే డైలాగ్‌లు సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె వాయిస్‌ ఆకట్టుకునేలా ఉంది. అది సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. దీంతో దీపికాకి డబ్బింగ్‌ చెప్పింది ఎవరనేది ఆరా తీస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. దీపికాకి డబ్బింగ్‌ చెప్పింది ఎవరో కాదు, హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల అని సమాచారం.

56

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు శోభితానే దీపికాకి డబ్బింగ్‌ చెప్పిందట. దీపికా వాయిస్‌ ఆకర్షించేలా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు శోభితా పేరు బాగా వినిపిస్తుంది. ఆమె హైలైట్ గా మారింది. ఇప్పటి వరకు హీరోయిన్‌గా, గ్లామర్‌ బ్యూటీగా మెప్పించిన శోభితాలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్, అభిమానులు. 
 

66

శోభితా దూళిపాళ్ల చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటూనే యాక్షన్‌తోనూ మెప్పిస్తుంది. దీంతో ఈ బ్యూటీ చాలా స్పెషల్‌ గా నిలుస్తుంది. హీరోయిన్‌ పాత్రలకే కాదు, బలమైన ఇతర పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్‌ అవుతుంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఇండియన్‌ బ్లాక్‌ బస్టర్‌ `కల్కి 2898ఏడీ`లో శోభితా కూడా భాగం కావం విశేషమనే చెప్పాలి. ఈ చిత్రంతో ఆమెకి ఇక అవకాశాల జోరు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే శోభితా దూళిపాళ్ల, నాగచైతన్య సీక్రెట్‌ డేటింగ్‌ లో ఉన్నట్టు పూకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories