ఇక మోక్షజ్ఞ హీరోగా లాంచ్ చేయడానికి .. బాలయ్య ఓ ప్లాన్ వేశారట. తన సినిమాల్లో ఆల్ టైమ్ హిట్ గా.. ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిన ఆదిత్య369 సీక్వెల్ ద్వారా తన వారసుడి ఎంట్రీ ఉంటుంది అని తెలుస్తోంది. ఈసినిమాకు ఆదిత్య999 అనే టైటిల్ కూడా డిసైడ్ చేశారని సమాచారం. మరో వైపు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో దర్శకుల లిస్ట్ పెరుగుతోంది. పూరీ జగన్నాథ్ తో పాటు.. బోయపాటి, బాబి, అనిల్ రావిపూడి, ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య చివరిగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.