ఆయన తెలుగులో వందకుపైగా సినిమాలు చేశారు. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. కమర్షియల్ మీటర్‌ని పరిచయం చేసిన దర్శకుడిగా నిలిచారు. గ్లామర్ కి కొత్త అర్థాన్ని చెప్పిన దర్శకుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య, రాజశేఖర్, జగపతిబాబు ఇలా అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అందరికి హిట్లు ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఒక్క బాలయ్యకి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు.